సితారకు అనారోగ్యం.. మహేష్ ఒడిలో అలా పడుకొని ఫోటో వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలలో అభిమానులకు దగ్గరగా ఉండే ఫ్యామిలీలో మహేష్ బాబు ఫ్యామిలీ అని చెప్పవచ్చు.మహేష్ బాబు కూడా అటు సినిమాలకు, ఇటు కుటుంబానికి సమానంగా బాధ్యతలు వహిస్తాడు.

 Illness To Sitara Namrata Shares Mahesh Babu Sitara Photo, Mahesh Babu, Namrata,-TeluguStop.com

ఇక కుటుంబం కోసం ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు మహేష్ బాబు.షూటింగ్ విరామ సమయంలో ఫ్యామిలీతో బాగా గడుపుతాడు.

ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు ఒడిలో తన కూతురు సితార పడుకోని ఉన్న ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇపుడున్న పరిస్థితుల వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడటంతో సెలబ్రిటీలంతా తమ ఫ్యామిలీతో సంతోషంగా గడిపేస్తున్నారు.

మహేష్ బాబు భార్య నమ్రత కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మహేష్ బాబు తన పిల్లలతో గడుపుతున్న సమయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది.ఇదిలా ఉంటే తన సోషల్ మీడియా వేదిక ద్వారా తాజాగా ఓ ఫోటో షేర్ చేసుకోగా అందులో మహేష్ బాబు ఒడిలో తన గారాల పట్టి సితార హాయిగా నిద్ర పోతూ కనిపించింది.

Telugu Lllness, Mahesh Babu, Namrata, Sitara-Movie

ప్రస్తుతం ఈ ఫోటో ఎంతో క్యూట్ గా ఉండగా.ఇది చూసిన నెటిజనులు బాగా లైక్ చేస్తున్నారు.ఇక కొందరు సితార అనారోగ్యం బాలేదా అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో మరో సినిమా చేయనున్నాడు.ఇదిలా ఉంటే డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలిసింది.

ఇక మొత్తానికి షూటింగులు వాయిదా పడగా.మహేష్ ఇంట్లో ఉంటూ పిల్లలతో మంచి సమయం గడుపుతున్నట్లు అర్థమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube