అమ్మ బాబోయ్ : క్షవరం పేరుతో అలాంటి పనులు చేస్తున్న యువతి..  దాంతో పోలీసులు...- Illegible Activitys Going Behind Beauty Spa In Nellore

illegible activity\'s going behind beauty spa in Nellore, beauty spa, illegible activity\'s, crime news, Nellore news, Andhra Pradesh, - Telugu Andhra Pradesh, Beauty Spa, Crime News, Illegible Activity\\'s, Illegible Activity\\'s Going Behind Beauty Spa In Nellore, Nellore News

ఈ మధ్య కాలంలో కొందరు డబ్బులు సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.ఈ క్రమంలో ఓ యువతి ఇద్దరు యువకులతో కలిసి బ్యూటీ సెలూన్ పేరుతో ఏకంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు నగర పరిసర ప్రాంతంలో వెలుగు చూసింది.

 Illegible Activitys Going Behind Beauty Spa In Nellore-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే ఇటీవలే స్థానిక ప్రాంతంలో “ప్లాటినమ్ సెలూన్ మరియు బ్యూటీ స్పా” అనే సెలూన్ ని కలకత్తాకు చెందిన ఓ యువతి నడుపుతోంది.ఈ క్రమంలో సెలూన్ సెంటర్లో వ్యభిచారం జరుగుతున్నట్లు కొందరు స్థానికులు గుర్తించి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు.

 దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మఫ్టీలో వెళ్లి విటుల గుట్టు రట్టు చేశారు.

 Illegible Activitys Going Behind Beauty Spa In Nellore-అమ్మ బాబోయ్ : క్షవరం పేరుతో అలాంటి పనులు చేస్తున్న యువతి..  దాంతో పోలీసులు…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో కలకత్తాకు చెందినటువంటి ఓ యువతిని మరియు ఇద్దరు  విటులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయంపై స్పందించిన కొందరు స్థానికులు గత కొద్దికాలంగా బ్యూటీ స్పా పేరుతో ఎవరికీ అనుమానం రాకుండా వ్యభిచార గృహం నడుపుతున్నారని చెబుతున్నారు.అంతేకాక మనుషుల జీవితాలను నాశనం చేసేటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న యువతి మరియు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా రైడ్ లో పట్టుబడిన నిందితులను అరెస్టు చేసి పలు చట్టాల కింద కేసు నమోదు చేశారు. అంతేగాక ఈ బ్యూటీ స్పా బాగోతం వెనక ఎవరున్నారని అంశంపై విచారణ చేస్తున్నారు.

అలాగే నగరంలో ఎవరైనా వ్యక్తులు అనుమానంగా కనబడినా లేదా అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్నట్లు అనుమానం వచ్చినా వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు తెలియజేయాలని పోలీసులు ప్రజలను కోరారు.

#Andhra Pradesh #Beauty Spa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు