అర్ధరాత్రి అక్రమ నిర్మాణాలు?

యాదాద్రి జిల్లా:సామాన్య జనం ఏదైనా నిర్మాణం చేపడితే అన్ని అనుమతులు ఉన్నా ఏదో ఒక వంకతో ఇంటి నిర్మాణాలను నిలిపివేసే అధికారులు, డబ్బులున్న,అధికార పార్టీకి చెందినవారైతే చేతులు కట్టుకొని చోద్యం చూస్తూ ఉండడం అలవాటుగా చేసుకున్నారు.చౌటుప్పల్ నడిబొడ్డులో కోట్లు విలువ చేసే భూమి తమదేనంటూ ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టారు.

 Illegal Structures At Midnight?-TeluguStop.com

ఇంటి నిర్మాణం కోసం ఎటువంటి దరఖాస్తు చేసుకోకుండానే ఇంటి నిర్మాణ పనులు చేపట్టారు.అర్ధరాత్రి వరకు నిర్మాణ పనులు చేపట్టడంపై స్థానిక ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ప్లాన్ ప్రకారమే ఇంటి నిర్మాణం.ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓ ఇంటి నిర్మాణం చేపట్టాలంటే ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుని టిపిఓ పరిశీలించి నిబంధన మేరకు అన్ని ఉన్నాయా లేదా అని పరిశీలించి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన అనంతరం అనుమతులు ఇవ్వడం జరుగుతుంది.కానీ,ఇంటి నిర్మాణానికి ఎటువంటి దరఖాస్తు చేసుకోలేదు.

ముందుగా ఇంటి నిర్మాణం చేస్తే అసెస్మెంట్ ఇచ్చే విధంగా అధికారులతో సదరు వ్యక్తులు లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది.ఆన్లైన్లో తమ పేరు మీద ఇంటి నెంబర్ నమోదు జరిగితే తర్వాత అవసరమైన డాక్యుమెంట్ లను సృష్టించవచ్చుననే పథకం ప్రకారం నిర్మాణం జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

అనుమతులు లేవు.కానీ,ఏం చర్యలు తీసుకోము.

అక్రమ ఇంటి నిర్మాణంపై డిఈ విశ్వేశ్వరరావును వివరణ కోరగా ఇట్టి ఇంటి నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేవని తెలిపారు.శనివారం మున్సిపల్ కమిషనర్ సెలవులో ఉన్న కారణంగా ఎటువంటి చర్యలు తీసుకోనన్నారు.

మూడు నెలలుగా ఈ భూమిపై వివాదం కొనసాగుతుందని,అక్రమ నిర్మాణం అయినప్పటికీ తాను ఈ విషయంపై స్పందించనన్నారు.మున్సిపల్ కమిషనర్ వచ్చిన తర్వాత చర్చించి అక్రమ నిర్మాణం అయితే అప్పుడు కుల్చివేస్తామని తెలిపారు.

మున్సిపల్ పరిధిలో ఎక్కడ నిర్మాణం చేపట్టినా వాలిపోయే మున్సిపల్ సిబ్బంది ఈ ఇంటి నిర్మాణంపై ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.మున్సిపల్ చైర్మన్, సంబంధిత అధికారులతో లోపాయకారి ఒప్పందం జరిగిందని అందుకే అక్రమ నిర్మాణంపై స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.

అసెస్మెంట్ నెంబర్ కోసం నిర్మాణం చేపట్టాం.తర్వాత దరఖాస్తు చేసుకుంటాం -బాలాజీ రావు.

గతంలో ఈ భూమి తమదేనని,గ్రామ కంఠం పరిధిలో ఉండడం చేత ఇంటి నెంబర్ ఇప్పుడు ఆన్లైన్లో (cdma) చూపించడం లేదు.ఇంటి నిర్మాణం చేపడితే అసెస్మెంట్ వస్తుంది,కావున ఇంటి నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది.

అసెస్మెంట్ నెంబర్ వచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకుంటాము.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube