అక్రమ వలసల్లో భారతీయులే అధికం..   Illegal Indian NRI Migration To Britain     2018-10-14   09:22:56  IST  Surya

భారతీయుల ధాటిని తట్టుకోవడానికి ఏ దేశమూ ముందుకు రావడంలేదు..బహుశా వాళ్ళు ఎక్కువైపోతే దేశాన్ని ఆక్రమించుకుంటారా అనే భయమా..?? లేక చివరకి తమ దేశాలన్నీ భారతీయులతో నిండిపోతాయని బెంగో తెలియదు కానీ భారతీయుల సంఖ్య ని తగ్గించుకోవడానికి వాళ్ళు పడని పాట్లు లేవు అయితే ఈ వలసలని తగ్గించుకోవడానికి తమ తమ వీసా నిభంధనలని ఖటినతరం చేస్తున్నారు కూడా…అయినా సరే భారతీయుల వీసాల అభ్యర్ధన ఎక్కడా తగ్గటం లేదు..ఇదిలాఉంటే

బ్రిటన్‌ లో వీసా గడువు దాటినా సరే అక్కడే ఉంటున్న వలస ప్రవాసుల్లో అత్యధికులు భారతీయులేనని బ్రిటన్‌ విదేశాంగ , కామన్వెల్త్‌ శాఖ వెల్లడించింది. గత మూడేళ్లలో బలవంతంగా భారత్‌కు తిప్పి పంపేవారి సంఖ్య 50 శాతం మేర పడిపోయిందని అది తెలిపింది..గడువు దాటిన వారిపై చర్యలని తీసుకుంటామనే హెచ్చరికలు ఉన్నాసరే వాటిని ఖాతరు చేయడంలేదని తెలుస్తోంది.

Illegal Indian NRI Migration To Britain-

అయ్తీ ఇప్పుడు వీళ్లందరినీ కదిలించాలంటే ఆ ప్రభావం భారత్‌, బ్రిటన్‌ ద్వైపాక్షిక సంబంధాలపై పడుతుందనే అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది..దాంతో గడువు ముగిసిన వారిని పంపాలని అనుకున్నా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అది సాధ్యం కాదని తెలుస్తోంది..బ్రెగ్జిట్‌ అనంతరం భారత్‌తో సంబంధాల గురించి విచారించిన ఈ పార్లమెంటరీ కమిటీ వీసా విధానంపై సమాలోచనలు చేస్తోందని తెలిపింది.