వైట్ హౌస్ ను ఆశ్రయించిన భారతీయ యువతీ యువకులు...రీజన్ ఏంటంటే..!!!

అమెరికాకు ఎంతో మంది భారతీయులు వలసలు వెళ్ళారు.వారిలో కొందరు గ్రీన్ కార్డ్ అర్హులుగా మారి అమెరికాలో శాశ్వత నివాసం పొందగా, మరో కొందరు తాత్కాలిక వీసాల ద్వారా అమెరికాలో నివాసం ఉంటున్నారు.

 The Dream Act Youth Requests White House To Stay In America, The Dream Act , Ill-TeluguStop.com

అయితే ఇప్పుడు వీరిలో కొందరికి పెద్ద చిక్కువచ్చి పడింది.అమెరికా నిభంధనల ప్రకారం.

గ్రీన్ కార్డ్ కాకుండా ఇతరాత్రా ఎలాంటి వీసాలు ఉన్న వాళ్ళయినా వారి పిల్లలకు 20 ఏళ్ళ వరకే అమెరికాలో ఉండేందుకు అనుమతులు లభిస్తాయి.అదే 21 ఏళ్ళు దాటితో వారి పిల్లలు పేరెంట్ వీసాతో అమెరికాలో ఉండేందుకు అర్హులు గా పరిగణించబడరు.

ఇప్పుడు

ఈ నిభందనే 21 ఏళ్ళు వచ్చిన ఎంతో మంది భారతీయ యువతీ యువతకు ఆందోళన కలిగిస్తోంది.వీరు అమెరికాలో ఉండేందుకు ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడం కారణంగా వీరు బలవతంగా స్వదేశానికి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

దాంతో ఇప్పుడు భారతీయ యువతీ యువకులు అందరూ వైట్ హౌస్ ను ఆశ్రయించారు.ఎన్నో ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాం.

21 ఏళ్ళు దాటడం మాకు శాపం కాకూడదు, మమ్మల్ని అమెరికాలో ఉండనివ్వండి, మా తల్లి తండ్రుల నుంచీ విడదీయవద్దు అంటూ బిడెన్ కు విజ్ఞప్తులు పంపారు.దాంతో

Telugu Daca, Indians, Joe Biden, Dream, Dreamwhite-Telugu NRI

ఈ పరిస్థితుల నుంచీ బయట పడటానికి ఇలాంటి వారందరినీ ఒకే వేదికపై తీసుకురావాలి దీప్ పటేల్ అనే వ్యక్తి “ ది డ్రీమ్” పేరుతో ఓ సంస్థను స్థాపించారు.పేరెంట్ వీసా అర్హతలు లేని వారిని పరిగణలోకి తీసుకుని వారిని అమెరికాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అభ్యర్దిస్తున్నారు.ఒబామా హయాంలో ఇలాంటి వారి అమెరికాలో ఉండేందుకు “ డాకా “ అనే చట్టాన్ని తీసుకువచ్చారని, అయితే ట్రంప్ తన హయాంలో ఈ చట్టాన్ని ఎత్తేసారని మళ్ళీ ఈ చట్టాన్ని అమలు చేస్తే ఎంతో మంది యువతీ యువకులకు మేలు జరుగుతుందని కోరారు.

కొందరు సెనేటర్ లు కూడా ఈ విషయంపై స్పందించి కాంగ్రెస్ సభ్యులకు ఈ విషయాన్ని తెలిపారని, వారు కూడా ఈ విషయంలో సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube