వెబ్‌ సిరీస్‌ లో నటించబోతున్న ఇల్లీబేబీ

సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ ఇలియానా బాలీవుడ్‌ కు బర్ఫీ సినిమాతో వెళ్లి అక్కడ స్టార్‌ డం దక్కించుకుంది.అయిదు ఆరు సంవత్సరాలు అక్కడ సందడి చేసింది.

 Iliana D Cruz Act In Web Series, Iliayana , Web Series, Ott, Ajay Devagan, Ravi-TeluguStop.com

అయితే గత ఏడాది కాలంగా ఆమెకు అక్కడ ఆఫర్లే కరువయ్యాయి.దాంతో సౌత్‌ లో కూడా మళ్లీ ప్రయత్నించింది.

రవితేజతో ఒక సినిమాను చేసింది.ఆ సినిమా నిరాశ పర్చింది.

దాంతో తెలుగులో మళ్లీ ఈమెకు ఛాన్స్‌ లు రావడం లేదు.బాలీవుడ్‌ లోనే ఏదోలా ప్రయత్నించాలని భావించి అక్కడే ఉండిపోయింది.

ఇలాంటి సమయంలో ఈమెకు అక్కడ ఒక వెబ్‌ సిరీస్‌ లో ఛాన్స్‌ దక్కింది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగన్‌ ఒక ఇంగ్లీష్‌ వెబ్‌ సిరీస్‌ రీమేక్‌ లో నటించబోతున్నాడు.

అందులో ఇలియానా నటించబోతుంది.ఇప్పటికే అజయ్‌ దేవగన్‌ మరియు ఇలియానా జోడీ సక్సెస్‌ జోడీగా నిలిచింది.

అందుకే ఈ వెబ్‌ సిరీస్‌ ఖచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంటుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.తెలుగు మరియు తమిళ భాషల్లో మంచి క్రేజ్‌ ఉన్న ఇలియానా ఈ వెబ్‌ సిరీస్‌ ల్లో నటిస్తే సౌత్‌ లో కూడా వెబ్‌ సిరీస్‌ కు మంచి ఆధరణ దక్కుతుందని మేకర్స్‌ భావించారట.

Telugu Iliayana Cruz, Ravi Teja, Web-

ఈమద్య కాలంలో ఓటీటీ కోసం స్టార్స్‌ నటించేందుకు సిద్దం అవుతున్నారు.ముందు ముందు మొత్తం కూడా ఓటీటీ కంటెంట్‌ ఉంటుంది.కనుక ఇప్పటి నుండే అక్కడ జెండా పాతేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇలియానా హీరోయిన్‌ గా చాన్స్‌ లు దక్కించుకోవడం కష్టం అనే ఉద్దేశ్యంతో చివరకు ఓటీటీ కంటెంట్‌ పై దృష్టి పెట్టింది.

దీంతో ఈమె మరో నాలుగు అయిదు సంవత్సరాల పాటు ఓటీటీలో సందడి చేయడం ఖాయం అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube