ఇలియానా 'పోకిరి'ని రిజెక్ట్ చేసింది..! తర్వాత ఆమెను ఒప్పించింది ఎవరో తెలుసా.? అసలెందుకు రిజెక్ట్ చేసిందో?   Ileana Wanted To Reject Mahesh Babu Pokiri Movie     2018-11-13   09:33:31  IST  Sainath G

ప్రిన్స్ మహేష్ బాబు, అందాల భామ ఇలియానా కాంబినేషన్‌లో వచ్చిన పోకిరి చిత్రం టాలీవుడ్‌ రికార్డులను తిరగరాసింది. మహేష్, ఇలియానా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ కావడంతో తెర మీద సన్నివేశాలు బ్రహ్మండంగా పండాయి. కానీ పోకిరి చిత్రాన్ని రిజెక్ట్ చేసిందట. అంత మంచి సినిమాను ఇలియానా రిజెక్ట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా.? నిజమే అండి. ఈ విషయాన్ని అమర్ అక్బర్ ఆంథోని ప్రమోషన్‌లో భాగంగా వెల్లడించింది.

ఓ దశలో నేను పోకిరి సినిమా కూడా చేయకూడదని అనుకొన్నాను. ఆ సమయంలో చాలా ఓ రకమైన ఆందోళనలో ఉన్నాను. అందుకే పోకిరి చేయకూడదని అనుకొన్నాను. కానీ మహేష్‌బాబు సోదరి మంజుల ఫోన్ చేసింది. చాలా మంచి కథ అని చెప్పి ఆ సినిమాను చేయమని అడిగింది. దాంతో పోకిరి చేశాను. తర్వాత నా కెరీర్ టర్న్ అయ్యింది.

Ileana Wanted To Reject Mahesh Babu Pokiri Movie-Ileana Movie Ravi Teja

రవితేజ హీరోగా నటిస్తోన్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో టాలీవుడ్ లో తిరిగి పూర్వవైభవాన్ని పొందాలని అనుకుంటోంది. 6 ఏళ్ల తర్వాత తిరిగి తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.