అవకాశాలు లేక చివరికి యాంకర్ గా మారబోతున్న టాప్ హీరోయిన్...

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ల సరసన కొనసాగినటువంటి గోవా బ్యూటీ ఇలియానా గురించి తెలియనివారుండరు.అయితే ఈ అమ్మడు వచ్చీ రావడంతోనే దేవదాస్ అనే చిత్రంతో సాలిడ్ హిట్ అందుకోవడం తో పాటు ఉ ఉ పలువురు అగ్రహీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది.

 Tollywood Heroine Ileana Want To Become A Sports Channel Anchor  Ileana, Tollywo-TeluguStop.com

అయితే టాలీవుడ్లో కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ఈ అమ్మడు బాలీవుడ్ పై ఉన్నటువంటి మక్కువతో అవకాశాల కోసం తన మకాం ని అక్కడికి మార్చింది.అయితే అక్కడికి వెళ్లిన ఈ సమయంలో అవకాశాలు బాగానే దక్కించుకున్నప్పటికీ ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ ఆశలన్నీ అడియాశలయ్యాయి.

అయితే తాజాగా ఇలియానా గురించి ఓ వార్త నెట్ లో వైరల్ అవుతుంది.

ఈ అమ్మడు రాబోయే కాలంలో యాంకర్ గా అవతారమెత్తనున్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేగాక ఇప్పటికే ఓ ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇలియానా ని కలిసి వివరాలను వినిపించినట్లు సమాచారం.

అయితే ఇలియానా కూడా ఈ ఆఫర్ పట్ల ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.అంతేగాక పారితోషికం విషయంలో కూడా స్పోర్ట్స్ ఛానల్ బాగానే ఆఫర్ చేసిందట.అయితే సినిమాల్లో ఎలాగో రాణించలేక పోతుండడంతో యాంకర్ గా మంచి అవకాశం మరియు పారితోషికం కూడా బాగుండడంతో వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఇలియానా టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్నటువంటి ఓ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే గతంలో కూడా రవితేజ మరియు ఇలియానా జంటగా నటించినటువంటి అమర్ అక్బర్ ఆంటోనీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది.అందువల్లే రవితేజ ఈ అమ్మడికి మరో ఛాన్స్ ఇచ్చినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube