బెల్లి భామ ఇలియానా ఈ మధ్య వార్తల్లో ఉంటూనే ఉంటోంది.మళ్ళి ఏం చేసింది ఈ గోవా బ్యూటి అనుకుంటున్నారా … అబ్బో చాలానే చేసింది.
రెమ్యునరేషన్ తగ్గించుకోకుండా మొండికేసి ఇటు దక్షిణాది లో అవకాశాలు కోల్పోయి, ఎలాంటి సినిమాలో చేయాలో తెలియక అటు బాలివుడ్ లోనూ అవకాశాలు కోల్పోయి ఖాలిగా ఉంటున్న ఈ సుందరికి, తన ప్రియుడు, ఆస్ట్రేలియా అందగాడు ఆండ్రూ నీబోన్ తో ఇటివలే నిశ్చితార్థం కుడా అయిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ వేడుకను అత్యంత రహస్యంగా నిర్వహించినట్లు సమాచారం.
సినిమాకు సంబంధించిన ఎవరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదని సినివర్గాల టాక్.ఇంతకీ ఇలియానా సినిమాలు మానేయాలి అనుకుంటోందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం.
జాకిచాన్ తో చైనా సినిమా అవకాశం వచ్చినట్టు వస్తున్న వార్తలను ఇంతవరకు ఇలియానా ఇటు ఒప్పుకోనులేదు అటు ఖండించనులేదు.బహుషా ఆ సినిమా పూర్తీ చేసి పెళ్లి చేసుకుంటుందేమో !
.