సినిమా ఛాన్సులు లేకపోవడంతో ఇల్లి పాప కూడా..!

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ సాధించాక వెంటనే బాలీవుడ్‌పై కన్నేసి అటు జంప్ అవుతుంటారు.ఈ కోవలోకే చెందింది గోవా బ్యూటీ ఇలియానా.

 Ileana, Ott, Web Series, Pspk26-TeluguStop.com

టాలీవుడ్‌లో మంచి ఫాంలో ఉన్నప్పుడే బాలీవుడ్ చెక్కేసిన ఈ బ్యూటీ, అక్కడ కూడా ఫేడవుట్ అవ్వడంతో తిరిగి సౌత్ సినిమాల వైపు చూస్తుంది.

ఈ క్రమంలో రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.

అయితే ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగలడంతో ప్రస్తుతం ఆడియెన్స్‌కు మరింత దగ్గరయ్యే ప్లాన్ చేస్తోంది.ఈ క్రమంలో ప్రస్తుతం మంచి ఆదరణ పొందుతున్న వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ఇలియానా పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ఓ మంచి కాన్సెప్ట్ ఉన్న వెబ్‌సిరీస్‌లో నటించేందుకు ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

ఇక ఈ వెబ్ సిరీస్‌లో ఇలియానా లేడీ ఓరియెంటెడ్ రోల్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి ఇల్లీ పాప కూడా ఓటీటీకే ఓటెయ్యడంతో ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube