ఆ హీరోయిన్లను చూసి ఇలియానా భయపడుతోంది

రాకరాక ఒక అవకాశమైతే వచ్చింది ఇల్లీ బేబికి.షూటింగ్లో చురుగ్గా పాల్గొంటోంది.

 Ileana Tensed With Akshay Kumar Sentiment-TeluguStop.com

మనం మాట్లాడుతున్నది అక్షయ్ కుమార్ కొత్త చిత్రం “రుస్తూమ్” గురించి అని తెలిసిందే కదా.ఒకవైపు ఆశ .మరోవైపు భయం .ఇదీ ఇప్పుడు ఇలియానా పరిస్థితి.

ఆశ ఎందుకంటే .ఇలాగే అక్షయ్ కుమార్ అవకాశమిస్తే ఇప్పుడు యమబీజీగా అయిపోయింది తాప్సీ.హిందీలో రెండు పెద్ద ఆఫర్లు తాప్సీ చేతిలో ఉన్నాయి.తాప్సీలానే తనని కూడా బాలివుడ్ జనాలు బీజీ చేసేస్తారని ఆశ.

భయం ఎందుకంటే, అక్షయ్ అవకాశమిచ్చిన మిగితా తెలుగు హీరోయిన్ల పరిస్థితి హిందీలో ఏమాత్రం బాగాలేదు.అక్షయ్ తో కట్టామీటాలో జతకట్టిన త్రిషకి ఆ తరువాత ఇక్కటంటే ఒక్క అవకాశం కూడా రాలేదు.

అక్షయ్ తో రెండు సినిమాలు చేసిన తమన్నా పరిస్థితి కూడా హిందీలో బాగాలేదు.దక్షిణాదిలో టాప్ స్టార్ గా ఎదిగినా, బాలివుడ్లో తమన్నా సాధించింది ఏమీ లేదు.

ఇక కాజల్ కూడా అంతే .అక్షయ్ సరసన స్పెషల్ ఛబ్బీస్ లాంటి హిట్ చిత్రం చేసినా లాభం లేకుండాపోయింది.ప్రస్తుతం కాజల్ చేతిలో ఒక హిందీ సినిమా ఉన్నా, అది చాలా చిన్న చిత్రం.

మరి రుస్తుమ్ తరువాత ఇలియానా పరిస్థితి తాప్సిలా మెరుగుపడుతుందో .లేక మిగితావారిలా మళ్ళీ దక్షిణాదికే వచ్చి ప్రయత్నాలు చేయాలో!

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు