ఏడాది క్రితం ఇదే రోజు అంటూ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అనుభూతిని గుర్తు చేసుకున్న ఇలియానా?

నటి ఇలియానా( Ileana ) ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు.ఈమె ఒకానొక సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో పాటు సౌత్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

 Ileana Shared First Time Pregnancy Confirm Experience Post Goes Viral , Ileana,-TeluguStop.com

ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం ఒక కుమారుడికి జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈమె పెళ్లి ఎప్పుడు చేసుకుంది ఏంటి అనే విషయాలను ఎవరికీ తెలియచేయలేదు కానీ తాను ప్రెగ్నెంట్( Pragnant ) అనే విషయాన్ని మాత్రం సోషల్ మీడియా వేదికగా తెలియచేయడంతో ప్రతి ఒక్కరు ఎన్నో సందేహాలను వ్యక్తపరిచారు.

అసలు ఇలియానా పెళ్లి ఎప్పుడు చేసుకుంది పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయ్యారా, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అంటూ ఎన్నో సందేహాలను వ్యక్తం చేశారు.

ఇలా ఈమె తన పెళ్లి విషయాన్ని దాచి ఏకంగా తల్లి కాబోతున్నాననే విషయాన్ని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోయారు.ఇక ఈమె పండంటి కుమారుడికి జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఇలా తరచూ తన కుమారుడితో కలిసి ఉన్నటువంటి ఫోటోలను ఇలియానా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు.

ఇక గత కొద్దిరోజుల క్రితం తన భర్త ఫోటోని కూడా ఈమె సోషల్ మీడియాలో అందరితో పంచుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇది ఇలా ఉండగా తాజాగా ఇలియానా చీర కట్టుకొని ఉన్నటువంటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆసక్తికరమైనటువంటి పోస్ట్ చేశారు.

ఇందులో భాగంగా తనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని తెలిసినప్పుడు తనకు కలిగిన అనుభూతి గురించి తెలియజేస్తూ ఈమె పోస్ట్ చేశారు.సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు నా చిన్నారి నా లోపల ఒక చిన్న పరిమాణంతో పెరగడం ప్రారంభించాడు.నాలో ఉన్నటువంటి భావాలు ఉత్సాహం తనని రక్షించడానికి, తనని బాగా చూసుకోవాలని గుర్తు చేస్తున్న విషయం ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది.ఏడాది తర్వాత అతను నా చేతులలో నిద్రపోవడం చాలా అద్భుతంగా అనిపించింది అంటూ ఈ సందర్భంగా ఈమె తన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన సమయంలో తనకు కలిగినటువంటి అనుభవాన్ని ఈ సందర్భంగా షేర్ చేస్తూ అందరితో పంచుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube