ఇలియానాకు అవి నచ్చలేదట

తెలుగు సినిమాలు పక్కనపెట్టి ఎప్పుడైతే బాలివుడ్ బాట పట్టిందో, అప్పటినుంచి ఇలియానా కెరీర్ లో ఊపు తగ్గిపోయింది.వెళ్లి వెళ్ళగానే రెండు మూడు మంచి ఆఫర్లు వచ్చినా, సక్సెస్ రేటు కూడా బాగానే ఉన్నా, ఇలియానాని పెద్దగా పట్టించుకోలేదు బాలివుడ్ జనం.

 Ileana Reveals The Reason Behind Gap After Happy Ending-TeluguStop.com

అందుకే రెండేళ్ళు ఖాలిగా కూర్చుంది.ఇప్పుడు లేకలేక అవకాశామైతే వచ్చింది అక్షయ్ కుమార్ పక్కన.

ఆగస్టులో విడుదల కాబోతోంది ఈ రుస్తుం చిత్రం.లేక్కలేసుకుంటే, దాదాపు రెండు సంవత్సారాల తరువాత ఇలియానా సినిమా ఒకటి విడుదల అవుతోంది.ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే కథలు నచ్చలేదు అంటోంది ఇల్లి బేబి.

” ఈ రెండేళ్ళు గ్యాప్ ఇవ్వడం అనేది కావాలని చేయలేదు.కాని ఈ విరామంలో నా దగ్గరకి వచ్చిన ప్రాజెక్ట్స్ నచ్చలేదు.ఇన్ని సినిమాలు చేసాక, నాకు నచ్చిన సినిమాలే చేయాలి అనిపిస్తూ ఉంటుంది.అలాగని కమర్షియల్ సినిమాలకి వ్యతిరేకం కాదు.కాని నా పాత్రకు పెద్దగా విలువ లేని కథలు నేను చేయలేను.

ఈ రెండేళ్ళ కాలంలో మనసుకి నచ్చే కథలు దొరకలేదు, అందుకే చేయలేదు ” అంటూ చెప్పుకొచ్చింది ఇలియానా.

నిజంగానే ప్రాజెక్ట్స్ నచ్చలేదో లేక అసలు ప్రాజెక్ట్స్ ఇలియానా దాకా రాలేదో.

ఏది ఏమైనా, చేతిలో ఉన్న రుస్తుం అయినా ఇలియానాకు అవకాశాలు తెప్పిస్తే సంతోషం

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube