రేటు తగ్గించేసిన ఇలియానా

డిమాండ్ ని బట్టే ధర ఉంటుందని ఎకానామిక్స్ చెబుతోంది.ఎక్కడైనా అంతే.

 Ileana Reduced Her Remuneration For South Movies-TeluguStop.com

ఒకప్పుడు ఇలియానా అంటే హాట్ కేక్.ఎంతైనా సరే ఖర్చుపెట్టి తమ సినిమాలో పెట్టుకోవాల్సిందే అని అనుకునేవారు.

దక్షిిణాదిలో కోటి రూపాయల పారితోషికం అందుకున్న తొలి కథానాయిక ఇలియానా.ఈ లెక్కలు కోటిన్నర దాకా కూడా వెళ్ళాయి

మరి ఇప్పుడో? రెండు సంవత్సరాలు ఖాలిగా కూర్చోని, లేక లేక ఓ అవకాశం వచ్చింది.అక్షయ్ కుమార్ సరసన రుస్తుమ్ లో నటిస్తోంది ప్రస్తుతం.ఇక కేవలం బాలివుడ్ నే పట్టుకోని వేలాడితే కష్టం అని అర్థం అయిపోయింది ఈ నడుమందాల సుందరికి.

దక్షిణాదిలో కూడా సినిమాలు చేయడానికి రెడీ అంట.అవకాశాల కోసం పారితోషికం కూడా తగ్గించేసుకుంది

తెలుగు, తమిళ సినిమాలకి ఇప్పుడు ఇలియానా అడుగుతున్న రేటెంతో తెలుసా? 50 లక్షలు.మీరూ నమ్మకపోయినా 50 లక్షలే.చెప్పాం కదా .డిమాండుని బట్టే రేటు

మరి ఈ డిస్కౌంటు ఆఫర్ ఏ నిర్మాతనైనా టెంప్ట్ చేస్తుందా? ఇలియానా నడుమందాలు మళ్ళీ తెరపై చూసే భాగ్యం తెలుగు ప్రేక్షకులకి దొరుకుతుందా చూడాలి!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube