గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం చేతిలో సినిమాలేవి లేకపోయినా సరే తన అందంతో ఆడియెన్స్ ను అలరిస్తుంది.తన బికినీ ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
మాల్దీవ్స్ లో బీచ్ సైడ్ ఎంజాయ్ చేస్తున్న ఇలియానా లేటెస్ట్ గా రెడ్ బికినీతో రెచ్చగొడుతుంది.పోకిరి పిల్ల కెరియర్ లో ఫాం తగ్గించినా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను అలరించడానికి ఎప్పుడూ రెడీ అంటుంది.
ఈ క్రమంలోనే సినిమాలు చేయకపోయినా సరే తన ఫోటో షూట్స్ తో వాళ్లని ఆకట్టుకుంటుంది.బీచ్ సైడ్ అందాల ప్రదర్శన చేస్తున్న ఇల్లి బేబ్ ని చూసి వారెవా అనేస్తున్నారు ఆమె ఫ్యాన్స్.
ఈమధ్య ఒకటి రెండు తెలుగు సినిమా ఛాన్సులు వచ్చినట్టే వచ్చి చేజారడంతో అమ్మడు అప్సెట్ లో ఉంది.ఈ ఫోటో షూట్స్ వల్ల ఎవరైనా ఛాన్సులు ఇవ్వకపోతారా అన్న ఆలోచనలో ఉంది అమ్మడు.ఇలియానా చేస్తున్న ఈ ఫోటో షూట్స్ వల్ల ఫ్యాన్స్ ఆమెకి మరింత దగ్గర అవుతున్నారు.అడపాదడపా ఫ్యాన్స్ తో చిట్ చాట్ కూడా అలరిస్తుంది.మళ్లీ తెలుగులో ఒక్క ఛాన్స్ వస్తే తానేంటో ప్రూవ్ చేస్తా అని అంటుంది ఇలియానా.