ఇలియానా ను గెంటేసారు

గోవా భామ ఇలియానా కు పెద్ద షాక్ తగిలింది.అసలే ఖాలిగా ఉంటుంటే రాక రాక పెద్ద అవకాశం వచ్చింది అని ఇలియానా పడ్డ సంతోషం ఎంతోకాలం నిలవలేదు.

 Ileana Out Of Jackie Chan Film?-TeluguStop.com

ఇలియానాను ప్రాజెక్టు నుంచి గెంటేసారు.

ఇక్కడ చెబుతున్నది జాకిచాన్ హీరోగా త్వరలో ప్రారంభం కాబోతున్న చైనా చిత్రం కుంగ్ ఫూ యోగా గురించి.

నిజానికి ఇది ఆమీర్ ఖాన్, జాకిచాన్ కలిసి చేయాల్సిన మల్టిస్టారర్.ఆ సమయంలో కత్రీనాకైఫ్ ని కథానాయికగా అనుకున్నారు.

కాని దంగల్ కారణంగా ఈ సినిమా చేయలేనని ఆమీర్ ప్రాజెక్టును వదిలేసాడు.ఆమీర్ తప్పుకోవడంతో కత్రీనా కూడా చేతులెత్తేసింది.

దాంతో నడుమందం ఇలియానా ను సంప్రదించారు.

అంతా ఒక పద్ధతిలో వెళ్తుండగా మళ్లీ ఏమయ్యిందో , ఇప్పుడు ఇలియానాకు బదులు నార్త్ భామ ఆమిరా దస్తూర్ ని ఎంపిక చేసారని వినికిడి.

ఆమీరా ధనుష్ అనేగన్ తో దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమే.అమీరాను రామ్ చరణ్ తని ఒరువన్ రీమేక్ లో కుడా కథనాయికగా అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube