లాక్ డౌన్ వలన మంచే జరిగింది అంటున్న ఇలియానా  

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకొని సడెన్ గా బాలీవుడ్ లోకి అడుగుపెట్టి తెలుగు సినిమాలని వదిలేసిన అందాల భామ ఇలియానా.ఈ అమ్మడు తెలుగు సినిమాలు వదిలేసిన తర్వాత బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.

TeluguStop.com - Ileana Joins Unfair And Lovely Movie Shooting

అయితే బాలీవుడ్ లో అడుగుపెట్టి ఎనిమిదేళ్లు అవుతున్న అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోతుంది.అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్న వాటి ద్వారా ఇలియానాకి అనుకున్న స్థాయిలో గుర్తింపు రావడం లేదు.

అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసిన కూడా ఆ క్రెడిట్ ఇలియానాకి రాలేదు.అయితే బాలీవుడ్ లోకి వెళ్లిన తర్వాత సినిమాల కంటే ఎక్కువగా బాయ్ ఫ్రెండ్ తో విహారయాత్రలు, హాట్ బికినీ ఫోటో షూట్ లతోనే ఈ అమ్మడు ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తూ సందడి చేస్తుంది.

TeluguStop.com - లాక్ డౌన్ వలన మంచే జరిగింది అంటున్న ఇలియానా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

రీసెంట్ గా ఇలియానా అన్ ఫెయిర్ అండ్ లవ్లీ అనే సినిమాలో నటిస్తుంది.లాక్ డౌన్ కి ముందే ఈ సినిమాని ఎనౌన్స్ చేసాక షూటింగ్ ప్రారంభం కాలేదు.

రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ మళ్ళీ ఆరంభం అయ్యింది.తాజాగా షూటింగ్ లో పాల్గొన్న ఇలియానా చాలా గ్యాప్ తర్వాత మరల షూటింగ్ కి హాజరై నటించడం పట్ల తన అభిప్రాయాలని ఇనస్టాగ్రమ్ లో షేర్ చేసుకుంది.

తొలిరోజు షూటింగ్‌లో చాలా భయపడ్డానని, కెమెరా ముందుకొచ్చి చాలా రోజులు కావడంతో అంతా కొత్తగా అనిపించిందని ఇలియానా పేర్కొంది.షూటింగ్‌ మొదటి రోజు నా పాత్రను మరచిపోయాననే అనుమానం కలిగింది.

ప్రాక్టీస్‌ చేసి వస్తే బాగుండేది అనుకున్నా.అయితే కెమెరా ముందుకెళ్లిన కొన్ని నిమిషాల్లోనే అంతా సర్దుకుంది.

నాకు తెలియకుండానే పాత్రలో లీనమైపోయా.లాక్‌డౌన్‌తో లభించిన సుదీర్ఘ విరామం వల్ల రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నా.

నా శారీరక, మానసిక శక్తుల్ని ఈ విరామంలో పునరుత్తేజితం చేసుకున్నా అని ఇలియానా చెప్పుకొచ్చింది

.

#Lock Down #Corona Effect #Ileana #UnfairAnd

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ileana Joins Unfair And Lovely Movie Shooting Related Telugu News,Photos/Pics,Images..