శ్రీనువైట్ల.. నీకు ఇంకా బుద్ది రాలేదా?       2018-05-21   22:28:27  IST  Raghu V

వరుసగా నాలుగు భారీ డిజాస్టర్‌లు చవిచూసిన తర్వాత ఏ దర్శకుడికి కూడా హీరోు ఛాన్స్‌ ఇవ్వరు. ఇటీవల కాలంలో ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్‌ అయితే ఆ దర్శకుడు కనిపించకుండా పోవాల్సిందే. కాని శ్రీనువైట్ల ఏకంగా నాలుగు అట్టర్‌ ఫ్లాప్‌లు అయినా కూడా అవకాశం దక్కించుకున్నాడు. ఈయనపై అభిమానం మరియు గౌరవంతో రవితేజ ఈయన దర్శకత్వంలో నటించేందుకు ముందుకు వచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రస్తుతం ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ తెరకెక్కుతుంది. ఈ చిత్రంపై ఏ ఒక్కరికి అంచనాలు లేవు. కనీసం రవితేజకు కూడా ఈ సినిమా ఆడుతుందనే నమ్మకం లేనట్లుంది. కేవలం శ్రీనువైట్ల కోసం ఈ సినిమాను చేస్తున్నాడు.

ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు శ్రీనువైట్ల ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రతి పాత్రకు సరైన నటీనటులను ఎంపిక చేయడంలో దర్శకుడు ప్రతిభ కనిపిస్తుంది. సినిమా సక్సెస్‌కు మొదటి పాయింట్‌ పాత్రలకు సరైన నటీనటులను ఎంపిక చేయడం అంటారు. తాను రాసుకున్న పాత్రలకు సరైన నటీనటులను ఎంపిక చేయడంతో పాటు, ఆ నటీనటుల వల్ల సినిమాకు కలిగే ప్రయోజనం ఏంటి అనే విషయాలను కూడా గుర్తించాల్సి ఉంటుంది. కాని శ్రీనువైట్ల మాత్రం అలా ఆలోచించడం లేదని, ఆయన అనాలోచిత నిర్ణయంతో సినిమాను మంట కలిపే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.

సినిమాకు హీరో తర్వాత హీరోయిన్‌ చాలా కీలకం. కొన్ని సినిమాల్లో హీరోయిన్స్‌ గ్లామర్‌ షోకే పరిమితం అవుతారు. అలాంటి వారి ఎంపిక కూడా చాలా చాలా ముఖ్యం. హీరోయిన్‌కు ప్రాముఖ్యత లేదు కదా అని ఎవరిని పడితే వారిని ఎంపిక చేస్తే ప్రేక్షకులు తిరష్కరిస్తారనే విషయం శ్రీనువైట్ల ఇంకా అర్థం చేసుకోవడం లేదు. రవితేజతో చేస్తున్న సినిమాలో మొదట హీరోయిన్‌గా అను ఎమాన్యూల్‌ను ఎంపిక చేయడం జరిగింది. ఆమె ప్రస్తుతం వరుస ఫ్లాప్‌లతో ఉన్న కారణంగా తొలగించారు. సరే సినిమా సెంటిమెంట్‌ కోసం, సినిమాకు క్రేజ్‌ పెంచడం కోసం మరో హీరోయిన్‌ను ఎంపిక చేయాలని శ్రీనువైట్ల భావించి అలా చేసి ఉండవచ్చు.

అను ఎమాన్యూల్‌ను తొలగించినప్పుడు అంతకంటే మంచి స్టార్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేస్తే శ్రీనువైట్ల మంచి నిర్ణయం అని అభినందించవచ్చు. కాని అను స్థానంలో ఇలియానాను ఎంపిక చేయడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. చాలా కాలం క్రితం తెలుగు నుండి బాలీవుడ్‌కు వెళ్లి పోయి, అక్కడ ఫేడ్‌ ఔట్‌ అయ్యి, ఆ తర్వాత వివాహం చేసుకున్న ఇలియానాను రవితేజకు జోడీగా ఎంపిక చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో కిక్‌ వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. కాని ప్రస్తుతం ఇలియానా పూర్తిగా మారిపోయింది. ఆమెను తెలుగు ప్రేక్షకులు పట్టించుకునే పరిస్థితి లేదు. పెళ్లి అయిన హీరోయిన్‌తో ప్రయోగం ఎందుకు అంటూ శ్రీనువైట్లపై విమర్శు వ్యక్తం అవుతున్నాయి. నాలుగు ఫ్లాప్‌లు వచ్చినా కాస్త జాగ్రత్త పాటించడం శ్రీనువైట్లకు తెలియడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.