గోవా బ్యూటీ ఇలియానా అతి త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతోంది.మంచి ఫామ్ లో ఉన్న సమయంలో బాలీవుడ్ కు వెళ్లిన ఈ అమ్మడు ఆ తర్వాత మళ్లీ తెలుగు లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించింది.
కాని ఆమె రీ ఎంట్రీ ఇచ్చిన రవితేజ మూవీ అమర్ అక్బర్ ఆంటోనీ బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటే అట్టర్ ప్లాప్ అయ్యింది.సినిమా కాస్త నిరాశ పర్చడంతో ఆమెకు తెలుగు లో మళ్లీ ఆఫర్లు రాలేదు.
అడపా దడపా సినిమాల్లో ఆఫర్లు వస్తున్నా కూడా వాటికి ఆమె నో చెబుతోంది.ఒక వైపు హిందీలో ఆఫర్లు రాక తెలుగు లో చేసేందుకు కూడా సిద్దంగా ఉన్నా కూడా ఆమెకు నిరాశ తప్పడం లేదు.
ఎట్టకేలకు తెలుగు నుండి మరో ఆఫర్ ఇలియానకు తలుపు తట్టింది.
ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమా లో ఐటెం సాంగ్ ను చేసేందుకు గాను ఈమెకు ఆఫర్ దక్కింది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఐటెం సాంగ్ తో పాటు ఈ అమ్మడికి మంచి రీ ఎంట్రీ కూడా ఈ పాటతో తెలుగులో దక్కుతుంది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు చక చక జరుగుతున్నాయి.అతి త్వరలోనే సినిమా షూటింగ్ ను ముగించబోతున్నారు.ఐటెం సాంగ్ లో ఇలియానాను నటింపజేయడం వల్ల సినిమా స్థాయిని మరింత పెంచడం అవుతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
అందుకే రామారావు ఆన్ డ్యూటీ సినిమా లో ఐటెం సాంగ్ ను ఇలియా తో చేయించడం జరుగుతుందట.ప్రస్తుతం ఇలియానా హిందీలో ఒక సినిమా ను చేస్తోంది.
ఈ ఐటెం సాంగ్ తో తెలుగు లో హీరోయిన్ గా కాకున్నా కనీసం ఐటెం సాంగ్ ల స్పెషలిస్ట్ గా అయినా సెటిల్ అయ్యేనా చూడాలి.