మొదటిచిత్రం దేవదాసుతోనే తెలుగు ప్రేక్షకుల మనసుల్ని గిలిగింతలు పెట్టింది.మలిచిత్రమే మహేష్ బాబుతో పోకిరి .
ఇంకేం, రాత్రికి రాత్రే ఇలియానా పెద్ద స్టార్.ఆ నడుమందాలకి యువత బానిసైపోయింది.
నిర్మాతలంతా క్యూ కట్టారు.ఆ రకంగా దక్షిణాదిలో కోటి రూపాయల పారితోషికం అందుకున్న తొలికథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది ఇల్లిబేబి.
మరి ఇప్పుడు ? ఇలియానా ఉన్నంత ఖాలీగా మరో హీరోయిన్ లేదేమో.చేతిలో సినిమాల్లేవ్ … చేతిదాకా వచ్చినట్టే వచ్చే అన్నీ చేజారిపోతున్నాయ్.
జాకిచాన్ తో సినిమా అని ఊరించి, తీరా సినిమా మొదలయ్యే సమయానికి ఆమీరా దస్తూర్ ని ఎంపిక చేసుకున్నారు కుంగ్ ఫూ యోగా నిర్మాతలు.రామ్ చరణ్ తో తని ఒరువన్ రిమేక్ లో అవకాశం చేతులదాకా వచ్చిపోయింది.
ఇప్పుడు ఆ ఛాన్స్ రకుల్ ప్రీత్ ఎగురేసుకుపోయింది.
అక్షయ్ కుమార్ రుస్తూమ్ లో సెకండ్ హీరోయిన్ గా ప్రస్తుతానికి ఇలియానానే అనుకుంటున్నా, అది కూడా ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి.
ఆ సినిమా చేతిలో ఉన్నా .సెకండ్ హీరొయిన్ గా ఇలియానా సాధించేది ఏముంటుంది.ఇక ఇలియానా పనైపోయినట్టేనా, సినిమాలు మానేసి తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్ళి చేసుకోని ఆస్ట్రేలియా చెక్కేయ్యాల్సిందేనా!
.