ఇంకా ఈ చెమటోడ్చడం ఎందుకు అమ్మడు?

దేవదాసు తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ఇలియానా.తెలుగు ప్రేక్షకులకు ఇలియానా అంటే చాలా ప్రత్యేకం అనడంలో సందేహం లేదు.

 Ileana Doing Reguler Work Out For Movie Offers , Devadas , Flim News, Ileana , I-TeluguStop.com

టాలీవుడ్‌ స్టార్స్ హీరోల్లో పలువురితో నటించి మెప్పించిన ఈ అమ్మడు ఆ తర్వాత బర్ఫీ అనే సినిమా తో బాలీవుడ్‌ కు వెళ్లింది.మొదటి ప్రయత్నంతోనే అక్కడ మంచి సక్సెస్ దక్కింది.

నటిగానే కాకుండా ఆమెకు కమర్షియల్‌ గా గుర్తింపు దక్కడంతో మళ్లీ మళ్లీ అక్కడ ఆఫర్లు వచ్చాయి.దాదాపుగా ఆరు ఏళ్ల పాటు అక్కడ వరుసగా సినిమా లు చేస్తూ వచ్చింది.

మంచి నటనతో అక్కడ స్టార్‌ డమ్‌ ను దక్కించుకున్న ఇలియానా కొన్నాళ్లుగా అక్కడ కూడా ఆఫర్లు దక్కించుకోలేక పోయింది.దాంతో తెలుగు లో ఈమె ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేసింది.

కాని ఇక్కడ కూడా ఆమె ప్రయత్నాలు సఫలం కాలేదు.అయినా కూడా ఈఅమ్మడు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం తగ్గడం లేదు.

Telugu Devadas, Ileana-Movie

ఈ అమ్మడు రెగ్యులర్‌ గా గంటల తరబడి వర్కౌట్స్ చేస్తూ చెమటోడ్చుతూనే ఉంది.ఇప్పటికే జీరో సైజ్‌ అన్నట్లుగా ఉన్న ఈ అమ్మడు ఫిజిక్ విషయంలో ఎంతో మంది హీరోయిన్స్ కు ఆదర్శం అన్నట్లుగా నిలుస్తుంది.అలాంటి ముద్దుగుమ్మ ఇలియానా కు పెద్దగా ఆఫర్లు లేకున్నా కూడా కష్టపడుతూ ఉండటం చూస్తుంటే ఇంకా ఈమెకు ఇండస్ట్రీలో కొనసాగుతాను అనే నమ్మకం గట్టిగా ఉన్నట్లుగా ఉందని.అందుకే ఈమె ఈ స్థాయిలో కష్టపడుతుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

పెద్ద ఎత్తున ఇలియానా అందాలు ఆరబోస్తూ వర్కౌట్ వీడియోలను మరియు ఫొటోలను షేర్‌ చేస్తుంటే అభిమానులు మళ్లీ ఈమెను సినిమా ల్లో చూడాలనుకుంటున్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.నెటిజన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఈమెకు మళ్లీ ఆఫర్లు ఇచ్చి నటింపజేస్తారేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube