తెలుగులో అగ్ర హీరోలపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన ఇలియానా

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎవరో ఒకరి మీద కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.తమకి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో లైంగిక వేధింపులు ఎదురయ్యాయి అంటూ ఒక మాట చెప్పి ఇండస్ట్రీ మీద జరుగుతున్నా నెగిటివ్ ప్రచారంకి ఆజ్యం పోస్తూ ఉంటారు.

 Ileana D'cruz Opens Up On Casting Couch In Film Industry, Tollywood, Bollywood,-TeluguStop.com

అయితే తమని వేధించింది ఎవరనే విషయం మాత్రం బయట పెట్టరు.ఇక వీరి వరుసలో ఒకప్పటి సౌత్ స్టార్ హీరోయిన్ ఇలియానా కూడా వచ్చి చేరింది.

బాలీవుడ్ లోకి వెళ్ళిన తర్వాత తెలుగు సినిమాలని చిన్న చూపు చూస్తూ పలు సందర్భాలలో మాట్లాడిన ఇలియానా ఇప్పుడు ఏకంగా తెలుగు స్టార్ హీరోల మీదనే కాస్టింగ్ కౌచ్ బాణం వదిలింది.తెలుగు ఇండస్ట్రీలో శ్రీ రెడ్డి రాజేసిన కాస్టింగ్ కౌచ్ కి కొత్తగా ఆజ్యం పోసింది.

తెలుగు ఇండస్ట్రీలో కొందరు అగ్ర హీరోలు నేరుగానే తనతో పడుకుంటావా అడుగుతారని ఇలియానా సంచలన వ్యాఖ్యలు చేసింది.ఇండస్ట్రీలో ఉన్న కొందరు అగ్ర నిర్మాతలు, హీరోల కోరికలు తీర్చకపోతే జూనియర్ ఆర్టిస్టుల నుంచి హీరోయిన్ల వరకు ఎవరికి అవకాశాలు రావని చెబుతున్నట్లు కామెంట్స్ చేసింది.

ఇల్లీ బేబీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.తెలుగు ఇండస్ట్రీని ఈమె టార్గెట్ చేయడం గమనార్హం.అవకాశం రావాలంటే కచ్చితంగా నేను ఆ పని చేయాలంట.దర్శకుడు, హీరోతో పడుకోవాలంట, మరి ఏం చేయాలని తనను ఓ కొత్త హీరోయిన్ వచ్చి అడిగిందని ఇలియానా చెప్పింది.

ఆ సమయంలో తానేం చెప్పగలనని ప్రశ్నించింది.ఇది పూర్తిగా నీ నిర్ణయం అని ఆమెతో చెప్పినట్లు ఒప్పుకుంది.

అయితే తనకి మాత్రం అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని మళ్ళీ చివర్లో సన్నాయి నొక్కులు నొక్కింది.మొత్తానికి అనాల్సిన మాటలు అన్ని అనేసి తాను మాత్రం పతివ్రతనే అనే విధంగా వాఖ్యలు చేస్తున్న ఇలాంటి హీరోయిన్స్ పై ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా విమర్శలు వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube