అమెజాన్ ప్రైమ్ లో టాక్ షో చేయబోతున్న ఇల్లీ బేబీ

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గ్రాండ్ సక్సెస్ అయ్యి బాలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడ సెటిల్ అయిన గోవా సుందరి ఇలియానా.ఈ అమ్మడు బాలీవుడ్ లో లిమిటెడ్ గానే సినిమాలు చేస్తున్న ఎప్పటికప్పుడు తన గ్లామర్ షో ద్వారా సోషల్ ద్వారా ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటుంది.

 Ileana Dcruz Talk Show In Amazon Prime-TeluguStop.com

అలాగే సీనియర్ హీరోలకి కూడా ఇలియానా ప్రధాన జోడీగా మారిపోతుంది.ప్రస్తుతం ఆమె అభిషేక్ బచ్చన్ నటించిన బిగ్ బుల్ సినిమాలో కీలక పాత్రలో నటించింది.

అలాగే అజయ్ దేవగన్ కి జోడీగా రుద్ర వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తుంది.ఇదిలా ఉంటే డిజిటల్ వరల్డ్ లో సెలబ్రిటీలకి మరింత ఎక్స్ పోజ్ అయ్యేందుకు కావాల్సిన అవకాశాలు ఒటీటీ ప్లాట్ ఫామ్స్ ఇస్తున్నాయి.

 Ileana Dcruz Talk Show In Amazon Prime-అమెజాన్ ప్రైమ్ లో టాక్ షో చేయబోతున్న ఇల్లీ బేబీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముఖ్యంగా పెద్ద పెద్ద స్టార్స్ అంటే ఇప్పట్లో డిజిటల్ ఎంట్రీ కష్టం కాబట్టి సెకండ్ కేటగిరీలో ఉన్నవారిపై డిజిటల్ చానల్స్ ఫోకస్ పెట్టాయి.ఈ నేపధ్యంలో ఇలియానా అమెజాన్ ప్రైమ్ తో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది.

సౌత్ లో అహలో సమంతా ఫస్ట్ టైం టాక్ షో చేసింది.ఇదే బాటలో తమన్నాతో కూడా ఒక టాక్ షో చేయించడానికి ఆహా రెడీ అవుతుంది.

ఇలాగే హిందీలో ఒక రియాలిటీ టాక్ షోని అమెజాన్ ప్లాన్ చేస్తుంది.దానికి వ్యాఖ్యతగా ఇలియానాని ఖరారు చేసింది.

ఇల్లీ బేబీ కూడా దీనికి ఒకే చెప్పినట్లు సమాచారం.త్వరలో ఈ టాక్ షోకి సంబందించిన పూర్తి వివరాలు బయటకొచ్చే అవకాశం ఉంది.

#OTT Platforms #Ileana D'cruz #Amazon Prime

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు