'గర్భవతిని అన్నారు..ఆ సమస్యతో బాధపడ్డాను...వరం రోజులు ఎవ్వరితో'..ఇలియానా సంచలన కామెంట్స్.!   Ileana D'cruz React About Rumours On Her Pregnancy     2018-11-12   12:16:15  IST  Sainath G

ఇలియానా పేరు చెప్పగానే పోకిరి, జల్సా, జులాయి, కిక్ లాంటి చిత్రాలు కళ్ళముందు మెదులుతాయి. నడుము అందంతో ఇలియానా తెలుగు కుర్రకారులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. పోకిరి చిత్రంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఇలియానా చాలా కాలం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది.

తర్వాత బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో ముంబైకి మకాం మార్చింది. అక్కడ అవకాశాలు తగ్గడంతో తిరిగి టాలీవుడ్ కి రావాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో రవితేజ హీరోగా నటిస్తోన్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో టాలీవుడ్ లో తిరిగి పూర్వవైభవాన్ని పొందాలని అనుకుంటోంది. 6 ఏళ్ల తర్వాత తిరిగి తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఇలియానా ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

Ileana D'cruz React About Rumours On Her Pregnancy-

తనకు పెళ్లయింది అంటూ వస్తున్న వార్తల గురించి ఇలియానా స్పందించింది. గర్భవతిని అంటూ కూడా ప్రచారం చేశారు. ఆ వార్తల గురించి సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూనే ఉన్నా. అయినా నా వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు అని ఇలియానా తెలిపింది.

Ileana D'cruz React About Rumours On Her Pregnancy-

తాను మానసిక సమస్యలతో బాధపడిన మాట వాస్తవమే అని ఇలియానా తెలిపింది. ఆ సమయంలో వారం రోజులపాటు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. ఎవ్వరితోనే మాట్లాడేదానిని కాదు. సమస్య గురించి పూర్తిగా తెలుసుకుని జాగ్రత్తలు పాటించా. అందువలనే ఆ సమస్య నుంచి బయటపడ్డా అని ఇలియానా చెప్పుకొచ్చింది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.