జీరో సైజులో మళ్ళీ ఎంట్రీ ఇస్తున్న రవితేజ హీరోయిన్....  

Tollywood Actress Ileana D\'cruz Doing Hard Work For Zero Size Figure - Telugu Ileana D\\'cruz, Kick, Raviteja, Telugu Viral News Updates, Viral In Social Media, Zero Size Figure, ఇలియానా

ఒకప్పుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరసన దేవదాసు అనే చిత్రంలో నటించి తన జీరో సైజు నడుముతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టినటువంటి గోవా బ్యూటీ ఇలియానా గురించి తెలియని వారుండరు.అయితే ఈ అమ్మడు తెలుగులో దాదాపుగా అందరు ప్రముఖ హీరోల సరసన నటించి కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో బాలీవుడ్ పైమనసు పారేసుకుంది.

Tollywood Actress Ileana D\'cruz Doing Hard Work For Zero Size Figure - Telugu Ileana D\\'cruz, Kick, Raviteja, Telugu Viral News Updates, Viral In Social Media, Zero Size Figure, ఇలియానా-Movie-Telugu Tollywood Photo Image

అనుకున్నదే తడవుగా తన మకాంని టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి మార్చింది.అయితే బాలీవుడ్లో అడపా దడపా అవకాశాలతో రాణిస్తున్నప్పటికీ సరైన హిట్ లేక పోవడంతో బాలీవుడ్ లో ఇలియానా ని గుర్తించే వారు కరువయ్యారు.

అయితే ఇది ఇలా ఉండగా గత కొద్దికాలంగా ఈ అమ్మడు చేతిలో అవకాశాలు లేకపోవడంతో పూర్తిగా బరువు పెరిగింది.అంతేగాక అనుకోని విధంగా బరువు పెరగడంతో ఈ అమ్మడుని చూసినటువంటి అభిమానులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

ఒకప్పుడు జీరోసైజు నడుముకి పెట్టింది పేరుగా ఉన్నటువంటి ఇలియానా ఒక్కసారిగా బొద్దుగా తయారవడంతో ఇలియానా అభిమానులు బాధపడుతున్నారు.గతంలో రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం ద్వారాటాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ చిత్రంలో కూడా ఇలియానా బొద్దు గానే కనిపించింది.

అయినా తెలుగు ప్రేక్షకులు ఇలియానాని బాగానే ఆదరించారు.అయితే ఈచిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడటంతో ఇలియానా ఆశలన్నీ అడియాశలయ్యాయి.

దీంతో తన శరీరాకృతిని మరింత మెరుగుపరుచుకునేందుకు ఈ అమ్మడుజిమ్ లో తీవ్రంగానే శ్రమిస్తోంది.గంటల తరబడి నిరంతరం వర్కౌట్లు చేస్తూ జిమ్ లోనే ఎక్కువ సమయం గడుపుతోంది.అయితే తాజాగాఇలియానాకి సంబంధించినటువంటి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.అయితే ఈ ఫోటోలను ఒకసారి పరిశీలిస్తే ఈ అమ్మడు తన పూర్వ వైభవాన్నిమళ్ళీ తెచ్చుకునేందుకు పడుతున్న కష్టం చూసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే ఇలియానా కూడా దాదాపుగా బరువు తగ్గినట్లు కన్పిస్తోంది.ఏదేమైనప్పటికీ ఇలియానా మళ్లీ తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చి సరైన పడితే ఇప్పుడు ఉన్నటువంటి స్టార్ హీరోయిన్లకు ఈ కష్టాలు తప్పవు అని చెప్పవచ్చు.

తాజా వార్తలు