తన శరీరంపై బోల్డ్ గా కామెంట్స్ చేసుకున్న ఇలియానా

హీరోయిన్స్ కి శరీరమే అందం.వారి బాడీ షేప్స్ పెర్ఫెక్ట్ గా ఉంటేనే స్టార్ హీరోయిన్స్ గా రాణించగలరు.

 Ileana D'cruz Is Beautifully Flawed In Latest Instagram, Tollywood, Bollywood, S-TeluguStop.com

ఎంతో మంది అందాల భామలు హీరోయిన్స్ అవ్వాలని కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో కొంత మంది మాత్రమే దర్శకులకి కనెక్ట్ అవుతారు.అలాంటి భామలు మాత్రమే ప్రేక్షకులని కూడా మెప్పిస్తారు.

అలాగే ఈ అందాల భామలు తమ బాడీ షేప్స్ పెర్ఫెక్ట్ గా మెయింటేన్ చేయడం కోసం క్రమం తప్పకుండా వర్క్ ఔట్స్ చేస్తూ ఉంటారు.నిత్యం ఫిట్ గా ఉండటానికి ట్రై చేస్తారు.

అయితే కొంత మంది భామలు చూడటానికి అందంగా ఉన్నా బాడీ షేప్స్ కరెక్ట్ గా లేకపోవడం వలన హీరోయిన్స్ గా రాణించలేరు.అయితే ఈ విషయంలో ఇలియానా చాలా ప్రత్యేకం అని చెప్పాలి.

ఆమె బాడీ షేప్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.టాలీవుడ్ లో ఆమె బాగా గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం ఆమె నడుము అందాలు.

దర్శకులు కూడా ఇలియానాలో ఆ నడుముని ఎక్కువగా ఫోకస్ చేసేవారు.

ఇదిలా ఉంటే ఇలియానాకి మాత్రం తన బాడీ గురించి చాలా నెగిటివ్ అభిప్రాయం ఉందని ఆమె మాటలబట్టి తెలుస్తుంది.

తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ లో తన ఫిజిక్ గురించి ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది.తన శరీరంలో ఎన్నో లోపాలు ఉన్నాయని, ఇప్పడు ఆ లోపాలే తనకు అందాలంటూ పేర్కొన్నారు.

నా శరీరాకృతిపై ఎప్పుడూ ఆందోళన చెందుతున్నాను.ఎదుటి వారికి ఎలా కన్పిస్తున్నానో అని బాధపడేదాన్ని.

నా థైస్‌ చాలా పెద్దగా ఉంటాయని అనిపించేవి.నా హిప్‌‌ చాలా వెడల్పుగా ఉంటుందని, నా నడుము సన్నగా ఉండేందని అనుకునేదాన్ని, నా వక్షోజాలు చిన్నగా ఉంటాయని, నా పొట్ట అనుకున్నంతా బాగోదని, భుజాలు బలహీనంగా ఉంటాయని అనిపించేది.

పెదాలు అందంగా లేవని, ఎక్కువ ఎత్తు ఉండనని బాధపడేదాన్ని.అసలు నేను స్మార్ట్‌, పర్‌ఫెక్ట్‌ కాదని అభిప్రాయపడేదాన్ని అని చెప్పింది.

అయితే ఇన్ని లోపాలు ఉన్నాయని తాను ఫీల్ అయినా ఆ స‌హ‌జ‌సిద్ధ‌మైన రూపమే త‌న‌కు అట్రాక్ష‌న్ అని ఇలియానా త‌న పోస్టులో పేర్కొంది.నేను ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండాలని అనుకోలేదు.

నాలోని ప్రతీ మచ్చను అందంగా భావిస్తున్నాను.నాలోని అన్నీ లోపాలను నా సొంత అందంగా మలుచుకున్నాను అంటూ తెలియజేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube