ట్రైనర్ మాటలకూ కన్నీళ్లు పెట్టుకున్న ఇలియానా.. అసలు కథ ఇది?

గత దశాబ్ద కాలం క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగ కొనసాగిన గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అప్పట్లోనే ఈమె కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంది అంటే ఈమె క్రేజ్ ఏ స్థాయిలో ఉండేదో అర్థమవుతుంది.

 Ileana Dcruz Gets Emotional In Gym Session Details,  Ileana, Tollywood, Heroine,-TeluguStop.com

ఇకపోతే ఇలియానా అప్పట్లో స్టార్ హీరోలతో కలిసి నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఈ క్రమంలోనే ఈమెకు బాలీవుడ్ అవకాశాలు రావడంతో బాలీవుడ్ వైపు వెళ్లిన ఈ బ్యూటీకి అక్కడ చేదు అనుభవం ఎదురైంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నప్పటికీ హిట్ మాత్రం లేక పోవడంతో తిరిగి టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చింది.ఇక్కడ కూడా ఇలియానాకు అలాంటి చేదు అనుభవం ఎదురయింది.ఈ క్రమంలోనే ఈమెకు తెలుగులో పూర్తిగా అవకాశాలు దూరమైనప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలు చేస్తున్న పెద్దగా గుర్తింపు లేదు.ఈ క్రమంలోనే ఇలియానా తన పూర్తి దృష్టిని తన శరీర ఫిట్నెస్ పై ఉంచింది.

ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన ట్రైనర్ అన్న మాటలను గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంది.

తన జీవితంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని ఏమోషనల్ అవుతూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చింది.

Telugu Actress Ileana, Gym, Ileana, Ileana Fitness, Tollywood, Workouts-Movie

వర్కౌట్ పూర్తయిన తర్వాత కాస్త ఎమోషనల్ అయ్యాను కన్నీళ్లు కూడా వచ్చాయి ఇలా నా జీవితంలో ఎప్పుడూ జరగలేదు.ఎందుకంటే వర్కౌట్స్ తర్వాత తన ఫిట్నెస్ ట్రైనర్ తన దగ్గరకు వచ్చి ఇప్పుడు నీ చేతులు నీ బాడీ దగ్గర పెట్టుకొని నీకోసం నీ శరీరం ఎంత కష్టపడుతుందో ఫీల్ అవుతుందో తెలుసుకో అని చెప్పారు.

Telugu Actress Ileana, Gym, Ileana, Ileana Fitness, Tollywood, Workouts-Movie

ఆ మాటలు విన్నాక ఇది నిజమే కదా అనిపించింది.అలా చేసిన తర్వాత తన శరీరం కోసం తను ఆలోచించి ఎంతో సంతోష పడ్డానని ఈ సందర్భంగా ఈమె ఎమోషనల్ అయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube