ఏమాత్రం తగ్గని దేవదాసు అందాల ముద్దుగుమ్మ అందం

టాలీవుడ్‌ లో దేవదాసు సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ ఇలియానా. తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ గా మారింది.

 Ileana After Workout Photo Goes Viral-TeluguStop.com

టాలీవుడ్‌ లో ప్రస్తుతం హీరోయిన్స్‌ కోటి రూపాయల పారితోషికం తీసుకోవడం చాలా కామన్ విషయం.కాని ఒకప్పుడు టాలీవుడ్‌ హీరోయిన్స్ 50 నుండి 70 లక్షల పారితోషికం తీసుకోవడం చాలా గొప్ప విషయం.

అలాంటి సమయంలో ఇలియానా కోటి రూపాయల పారితోషికం ను దక్కించుకుంది.తరుణ్‌ తో నటించిన ఒక సినిమా కు గాను ఇలియానా తీసుకున్న పారితోషికం ఆ ఏడాది మొత్తం టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీ గా నిలిచింది అంటే ఎంతటి సంచలనమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 Ileana After Workout Photo Goes Viral-ఏమాత్రం తగ్గని దేవదాసు అందాల ముద్దుగుమ్మ అందం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తర్వాత మూడు నాలుగు సంవత్సరాల వరకు ఏ హీరోయిన్‌ కూడా ఆ స్థాయి పారితోషికంను అందుకున్నదే లేదు.ఇలియానా అంతటి ప్రత్యేకతను సంతరించుకుంది.

Telugu Ileana, Ileana Photo Shoot, News About Ileana, Tollywood News-Movie

ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా రెండు దశాబ్దాలు కావస్తుంది.అయినా కూడా ఇలియానా అందం ఏమాత్రం తగ్గలేదు.మద్యలో కాస్త లావు అయినట్లుగా అనిపించినా మళ్లీ సన్నబడింది.ఈమద్య ఈమె వర్కౌట్ వీడియోలు మరియు ఫొటోలు చూస్తుంటే ఇన్నాళ్లు అయినా కూడా ఈ అమ్మడి అందం ఏమాత్రం తగ్గలేదు కదా అనిపిస్తుంది.

ఈ ఫొటోను చూస్తుంటే ఇలియానా ఇప్పటికి కూడా యంగ్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలను దక్కించుకునే అర్హురాలు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.ఆమె కు సరైన అవకాశం పడాలే కాని ఖచ్చితంగా కుమ్మేస్తుంది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి ఇలియానా ఈ ఫొటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. త్వరలో ఇలియానా ఒక తెలుగు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఒకటి రెండు నెలల్లో ఆ విషయమై అధికారికంగా ప్రకటన వస్తుందని ఆశిద్దాం.

#Ileana #Ileana #Ileana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube