చిన్నారికి సంగీతం పాఠాలు చెప్తున్న ఇళయరాజా.. వైరల్ వీడియో!

దక్షిణ భారత సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు ఇళయరాజా.ఈయన గురించి అందరికీ తెలిసిందే.

 Ilaya Raja Music Lessons To His Grand Daughter Viral Video-TeluguStop.com

తమిళనాడుకు చెందిన ఈయన ఎన్నో భాషల్లో తన పాటలను, సంగీత దర్శకత్వము అందించాడు.ఈయన ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు.ఎన్నో సంగీత వాయిద్యాలతో తన సంగీతాన్ని వినిపించారు.

1976లో సంగీత దర్శకుడిగా పరిచయమైన ఇళయరాజా.ఆ తర్వాత ఎన్నో సినిమాలలో సంగీతాన్ని వినిపించారు.దాదాపు 5 వేల పాటలను వినిపించారు.1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు.ఈయన సంగీతం ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను కదిపేలా చేసింది.

 Ilaya Raja Music Lessons To His Grand Daughter Viral Video-చిన్నారికి సంగీతం పాఠాలు చెప్తున్న ఇళయరాజా.. వైరల్ వీడియో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాకుండా ఈయన దగ్గర ఎంతోమంది సంగీతాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు.

ఇదిలా ఉంటే తాజాగా ఓ చిన్నారికి సంగీతం పాఠాలు నేర్పుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నిజానికి ఈయన దగ్గర పాఠాలు నేర్చుకోవాలంటే అదృష్టం ఉండాలి.అలాంటిది ఓ చిన్నారి తన అదృష్టాన్ని అందుకుంది.

ఇంతకీ ఆ చిన్నారి ఎవరో కాదు.ఇళయరాజా గారాల మనుమరాలు.

తన మనుమరాలు పియానో దగ్గర కూర్చొని ఆడుతున్న సమయంలో తన తాత ఇళయరాజా తన దగ్గరికి రావడంతో తను ఏదో కావాలని మారం చేస్తుంటే తనకు సంగీతాన్ని నేర్పించడానికి ప్రయత్నం చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.

ఈ వీడియోలు యువన్ శంకర్ రాజా తన కెమెరా లో బంధించి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు.ఇది చూసిన నేటి జనులు లవ్ సింబల్ తో తెగ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఇళయరాజా ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న రంగమార్తాండ సినిమాకు తన సంగీతాన్ని అందిస్తున్నారు.

#Grand Daughter #IlayaRaja #KrishnaVamshi #Ilaya Raja #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు