హీరో రామ్ అగ్నివేశ్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ఇక్షు సినిమా ప్రమోషన్ ఫస్ట్ లుక్

పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రామ్ అగ్నివేశ్, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి నటీనటులుగా ఋషిక దర్సకత్వంలో హనుమంతురావు నాయుడు అండ్ డాక్టర్ గౌతమ్ నాయుడు ప్రెసెంట్స్ లో వస్తున్న ఇక్షుసినిమాను ఐదు భాషల్లో విడుదలకు చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ ఫస్ట్ లుక్  ను విడుదల చేశారు.

 Ikshu Movie First Look Released On The Occasion Of Hero Ram Agnivesh Birthday-TeluguStop.com

అనంతరం డైరెక్టర్ రిషిక మాట్లాడుతూ .

మా హీరో రామ్ అగ్నివేశ్ మొదటి సినిమా అయిన చాలా ఎక్స్పీరియన్స్ హీరో లా నటించాడు, ఈ రోజు తన జన్మదినం సందర్బంగా మా ఇక్షు సినిమా ఏ.వి రిలీజ్ చేయటం జరిగింది, మా ఇక్షు సినిమా ఏ.వి మీ అందరకి నచ్చుతుంది అని అనుకుంటున్నాను, త్వరలో మా సినిమా ఒక మంచి రోజు చూసుకొని రిలీజ్ చేయటం జరుగుతుంది, ఈ జన్మదినం సందర్బంగా మా హీరో ఇక్షు మూవీ తో స్టార్ట్ అయిన జర్నీ ఫ్యూచర్ లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

 Ikshu Movie First Look Released On The Occasion Of Hero Ram Agnivesh Birthday-హీరో రామ్ అగ్నివేశ్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ఇక్షు సినిమా ప్రమోషన్ ఫస్ట్ లుక్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రొడ్యూసర్ హనుమంతురావు నాయుడు మాట్లాడుతూ .మా హీరోరామ్ అగ్నివేశ్  జన్మదినం సందర్బంగా మా హీరో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను, మా హీరో గతం లో కూడా సీనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ కూడా సింగిల్ టేక్ లో చేసాము, లొకేషన్ లో కూడా సింగల్ టేక్ ఆర్టిస్ట్ గా మా ఇక్షు టీం నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

గతం లో మేము రిలీజ్ చేసిన టీజర్ కి ప్రేక్షకులు నుంచి మంచి స్పందన లభించింది, త్వరలో సినిమా ట్రైలర్ లాంచ్ చేయనొతున్నాము, అలాగే ఒక మంచి రోజు చూసుకొని మా సినిమా ని రిలీజ్ చేయబోతున్నాము, మా సినిమా ని ఆదరిస్తారు అని కోరుకుంటూ మరొక్క సారి మా హీరో రామ్ అగ్నివేశ్ కి జన్మదిన శుభాకాంక్షలు.

నటీనటులు :

రామ్ అగ్నివేశ్, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి, తదితరులు

సాంకేతిక నిపుణులు:

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఋషిక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ గుత్తుల, జడి సాయి కార్తీక్ గౌడ్ మూల కథ: సిద్ధం మనోహర్ కెమెరా: నవీన్ తొడిగి పాటలు:-కాసర్ల శ్యామ్ మ్యూజిక్: వికాస్ బాడిస ఎడిటింగ్: ఎస్ బీ ఉద్ధవ్ ఆర్ట్స్: రాజు మాటలు: మున్నా ప్రవీణ్ కొరియోగ్రఫీ: భాను పి.ఆర్.ఓ: మధు వి ఆర్

#Agnivesh #Rushika #Ikshu #Rajeev Kanakala #Ikshu Poster

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు