జై కరోనా అంటూ ఐఐటీ స్టూడెంట్స్ ఆనందం,వైరల్ అవుతున్న వీడియో  

Iit Students Chant Jai Corona In Delhi - Telugu Corona Effect On All Over World, Delhi Iit Students, Iit Exams Are Post Pone, Iit Students,, Jai Corona Slogans

కరోనా ప్రపంచదేశాలను ఎలా భయబ్రాంతులకు గురి చేస్తుందో అందరికి తెలిసిందే.ఈ కరోనా ప్రభావం ప్రపంచదేశాల పై కూడా పడడం తో అన్ని దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి.

 Iit Students Chant Jai Corona In Delhi

అయితే కరోనా ప్రభావం తో గడగడలాడిస్తుండగా జనాలు భయాందోళనలు చెందుతున్నారు.మరోపక్క ఐఐటీ స్టూడెంట్స్ మాత్రం జై కరోనా.

జై కరోనా అంటూ నినాదాలు చేస్తున్నారు.దీనికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో రావడం తో ఇది వైరల్ గా మారింది.

జై కరోనా అంటూ ఐఐటీ స్టూడెంట్స్ ఆనందం,వైరల్ అవుతున్న వీడియో-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే అసలకె కరోనా ప్రభావం తో ప్రపంచ వ్యాప్తంగా 5 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా,లక్షల మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా ప్రభావం తీవ్రత పెరుగుతుండడం తో ప్రజలు ఆందోళన చెందుతుంటే, ఢిల్లీ కి చెందిన ఐఐతీ స్తూడెంట్స్ మాత్రం జై కరోనా…జై కరోనా అంటూ నినాదాలు చేస్తుండడం వైరల్ గా మారింది.

అయితే ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ కరోనా కి అసలు స్టూడెంట్స్ ఎందుకు జై కొట్టారో తెలుసా.క‌రోనా కార‌ణండా ఢిల్లీలోని ఐఐటీ క‌ళాశాల‌లో జ‌ర‌గాల్సిన ప‌రీక్ష‌లని కొద్ది రోజుల పాటు వాయిదా వేశారు.

దీంతో హాస్టల్‌ విద్యార్దులు ఆ క్ష‌ణాన్ని ఎంజాయ్ చేస్తూ ఈ మహమ్మారి కి జై క‌రోనా అంటూ నినాదాలు చేయ‌డ‌మే కాకుండా డ్యాన్స్‌లు చేశారు.

దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారడం తో ఈ వీడియో పై నెటిజ‌న్స్ ఘాటుగానే స్పందిస్తున్నారు.

పిచ్చి పీక్ స్టేజ్‌కి చేరితే ఇలానే ప్ర‌వ‌ర్తిస్తారంటూ కొంద‌రు నెటిజ‌న్స్ అంటున్నారు.భారత్ లో కూడా కరోనా ప్రభావం తీవ్ర రూపం దాల్చడం తో దేశ వ్యాప్తంగా ప్రభుత్వాలు అప్రమత్తమై చర్యలు చేపడుతున్నారు.