పబ్ జీ వద్దన్న పాపానికి కన్న తండ్రి ని ముక్కలు,ముక్కలు గా

ఇటీవల స్మార్ట్ ఫోన్ లో వాడకం పెరిగిపోవడం తో వాటిలో గేమ్స్ డౌన్ లోడ్ చేసుకొని యువత వాటికి బానిసలుగా మారి పోతున్నారు.దీనికి ప్రధాన ఉదాహరణ పబ్ జీ గేమ్.

 Iit Studentmurderedfather Warningdo Not Playthe Pubggame Phone-TeluguStop.com

ఈ గేమ్ ఆడని వారు ఎవరూ లేరనే చెప్పాలి.చిన్న నుంచి పెద్ద వరకు ఈ గేమ్ కు బానిసలుగా మారిపోతున్నారు.

ఈ గేమ్ వారి జీవితాల్లో ఎంత ఇన్ ఫ్లుయెన్స్ అవుతుందో పలు ఉదంతాలు విన్న విషయం తెలిసిందే.తాజాగా అలాంటి మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది.

పబ్ జీ ఆడుతుంటే అడ్డుకున్నారని కన్న తండ్రినే కత్తిపీట తో ముక్కలుగా నరికి హతమార్చిన ఘటన కర్ణాటక లో చోటుచేసుకుంది.కర్ణాటకలో బెళగావి తాలుకాలోని కాకతీ కాలనీలో సోమవారం జరిగింది.

హతుడు శంకరప్ప కమ్మార(60) కాగా, నిందితుడు అతని కుమారుడు రఘువీర్‌ కమ్మార (25).ఐటీఐ మెకానికల్‌ రెండో ఏడాది చదువుతున్న రఘువీర్‌ మొబైల్‌లో హింసను ప్రేరేపించే గేమ్స్‌కి బాగా అలవాటు పడ్డాడు.

దీనితో అతడు బాగా ఆ గేమ్ కు ఇన్ ఫ్లుయెన్స్ అయి విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు.

Telugu Games Download, Iit, Iitmurdered, Smart-

  ఇక ఆ పిచ్చి బాగా ముదిరిపోయి శనివారం అర్ధరాత్రి రఘవీర్ అటు ఇంట్లోనూ, వీధిలో ఇతరుల ఇంటికి వెళ్లి తలుపులు, కిటికీలు కొడుతూ తనకు రక్తం కావాలని వికృత చేష్టలు చేయడంతో స్థానికులు పోలీసులకు అప్పగించారు కూడా.అయితే యువకుడు కావడం తో పోలీసులు హెచ్చరించి అక్కడ నుంచి పంపించేశారు.అయితే ఆదివారం కూడా అలానే పబ్ జీ గేమ్ ఆడుతున్న కొడుకు అర్ధరాత్రి వరకు కూడా అలానే ఉండడం తో తల్లి,తండ్రి అక్కడకు చేరుకొని మందలించారు.

ఈలోపు రఘువీర్ చేతికి రక్తం కారుతుండడాన్ని గమనించిన తల్లి కట్టు కట్టే ప్రయత్నం చేసింది.అయితే రఘువీర్ దానికి అడ్డుకున్నాడు.ఈ క్రమంలో తండ్రి శంకరప్ప అక్కడకు చేరుకొని మందలించి బలవంతంగా కట్టు కట్టబోయాడు.దీనితో గేమ్ ని మధ్యలో డిస్ట్రబ్ చేసిన కోపంతో తల్లిని పక్కగదిలోకి తోసేసి గడియ పెట్టి.

ఇక తండ్రి పై దాడికి తెగబడ్డాడు.అదే సమయంలో అక్కడే ఉన్న కత్తి పీట తో తండ్రి పై దాడి చేయడం తో అతడు మృతి చెందాడు.

అయితే అంతటితో కూడా రఘువీర్ ఆగలేదు.తండ్రి శరీరాన్ని రెండు ముక్కలుగా కోసి తన పైశాచికత్వాన్ని చూపాడు.

మరోపక్క రఘువీర్ ఇంటి నుంచి అరుపులు వినిపించడం తో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.దీనితో అక్కడకి చేరుకున్న పోలీసులు రఘువీర్ ని అదుపులోకి తీసుకోవడానికి చాలా తిప్పలు పడాల్సి వచ్చింది.

ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు అతడిని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube