ఇకపై ఆక్సిజన్ స్ప్రే బాటిల్స్ లో..?!

సమస్త మానవాళి బతకాలంటె ఆక్సిజన్ అనేది చాలా అవసరం.ఆక్సిజన్ లేనిదే ప్రతి ప్రాణికి మనుగడ అనేది లేదు.

 Iit Kanpur Student Developed Pocket Friendly Oxygen Kit , Oxy Rise, Oxygen Spray-TeluguStop.com

అందుకే ఆక్సిజన్ ను ప్రాణవాయువు అని అంటారు.అంటే మనిషి ప్రాణాలను కాపాడే వాయువు అని అర్ధం అన్నమాట.

మనం తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేకపోయినా ఒక్క రోజు అయినా బతకవచ్చు.కానీ.

, ఆక్సిజన్ లేకుండా మాత్రం ఒక్క నిముషం కూడా మానవుడు ఉండలేడు.అయితే ఆక్సిజన్ అందరికి అందుబాటులో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా దీన్ని గురించి పట్టించుకోలేదు.

కానీ కరోనా కష్ట కాలంలో ప్రతి మనిషికి ఆక్సిజన్ విలువ ఏంటో అర్ధం అయిందనే చెప్పాలి.

కరోనా వైరస్ వ్యాప్తి అధికం అయినా సమయంలో చాలామంది ప్రాణవాయువు సరైన సమయంలో అందక ప్రాణాలు పోగొట్టుకున్నారు.

చాలా దేశాలు ఆక్సిజన్ కోసం ఎన్నో అగచాట్లు పడ్డాయి.ప్రధానంగా మనం భారత దేశంలో ఆక్సిజన్ కొరతతో ఎంతోమంది చనిపోయారు.మళ్ళీ థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్ కొరతతో ఏ ఒక్కరి ప్రాణాలు పోకూడదని, ఆక్సిజన్ అందరికి అందించేందుకు ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్ధి పాకెట్ ఫ్రెండ్లీ ఆక్సిజన్ కిట్ ను తయారుచేసారు.ఈ బాటిల్ చేతిలో ఇమిడిపోయే సెంట్ బాటిల్ సైజులో ఉంటుంది.

Telugu Carona, Covid, Iit Kanpur, Iit, Oxy, Oxygenspray, Pocketfriendly, Rs, Wav

ఈ ఆక్సిజన్ బాటిల్ అత్యవసర సమయంలో అంటే ఆక్సిజన్ లెవల్స్ పడిపోయిన సందర్భంలో ఆసుపత్రికి వెళ్ళేలోపు ఆక్సిజన్ షాట్స్ దీని ద్వారా అందించవచ్చు.ఈ స్పిన్ నానోటెక్ ప్రైవేటు లిమిటెడ్ కు చెందిన డాక్టర్ సందీప్ పాటిల్ దీనిని రూపొందించాడు.దీనికి అతను పెట్టిన పేరు ఆక్సిరైజ్.దీని ధర 499 రూపాయలుగా ఉంది.దీనిని ఆన్ లైన్ లో కొనుగోలు చేసుకునేందు అందుబాటులో ఉంచాడు.నోట్లో స్ర్పే చేసుకుంటే ఆక్సిజన్ విడుదలౌతుంది.సందీప్ దీనిని కంపెనీ వెబ్ సైట్ swasa.in లో విక్రయిస్తున్నాడు.ప్రస్తుతం రోజుకు 1000 బాటిల్స్ తయారవుతుండగా రానున్న రోజుల్లో దీనిని ఉత్పత్తిని మరింత రెట్టింపు చేయనున్నారు.థర్డ్ వేవ్ దృష్టిలో ఉంచుకుని మాస్కు, శానిటైజర్ తోపాటు, ఆక్సిరైజ్ బాటిల్ ను కూడా వెంట ఉంచుకుంటే మంచిదని అంటున్నారు నిపుణులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube