బ్లాక్ ఫంగస్ కోసం టాబ్లెట్స్.. ఐఐటీ హైదరాబాద్ పరిశోధకుల అభివృద్ధి..!

కరోనా నుండి కోలుకున్న వారికి కొత్తగా బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ భయబ్రాంతులకు గురి చేస్తుంది.బ్లాక్ ఫంగస్, యెల్లో, వైట్ ఫంగస్ ల గురించి రోజుకొక కొత్త వార్త షాక్ ఇస్తుంది.

 Iit Hyderabad Reseachers Developed Amb Tablets For Black Fungus , After Covid De-TeluguStop.com

అయితే వీటిని ఎదుర్కునేలా ఇప్పటికే ఔషధ కంపెనీలు మెడిసిన్ రెడీ చేస్తున్నాయి.ఈ క్రమంలో ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు బ్లాక్ ఫంగస్ కోసం ఓ మందు కనిపెట్టారు.

ఖరీదైన వ్యవహారంగా ఏర్పడిన బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఆంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్ తో చికిత్స అందిస్తున్నారు.అయితే హైదరాబాద్ పరిశోధకులు ఆంఫోటెరిసిన్-బి టాబ్లెట్స్ ను అభివృద్ధి చేశారు.

బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ కోసం ఇంజెక్షన్ ద్వారా కాకుండా నోటి ద్వారా తీసుకునే ఔషధాన్ని రెడీ చేశారు.ఈ టాబ్లెట్ తయారీ విధానాన్ని అందరితో షేర్ చేసుకునేందుకు వారు ముందుకొచ్చారు.

అయితే ఈ మాత్రలను భారీ ఎత్తున ఉత్పత్తి చేయగలిగే ఫార్మా కంపెనీ భాగస్వామి కోసం వెతుకుతున్నట్టు తెలుస్తుంది.టాబ్లెట్స్ కాబట్టి వీటిని చిన్నగా తీసుకునే వీలుంటుంది.దీని వల్ల రోగి దేహం మరింతగా కుదుట పడే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.ఒకవేళ ఈ ప్రయోగం సక్సెస్ అయితే బ్లాక్ ఫంగస్ కు మెరుగైన ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చినట్టే అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube