ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఐఐపీహెచ్..!

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది.రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.

 Gujarath, Iiph, Corona-TeluguStop.com

ప్రభుత్వాలు వైరస్ ని అరికట్టేందుకు ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రక్రియను కొనసాగించి విషయం అందరికి తెలిసిందే.కరోనా కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నాయి.

కొన్ని రాష్ట్రాల్లో కేసులు లక్షకు దాటింది.దీంతో ప్రజల్లో భయాందోళనకు గురవుతున్నారు.

భయటకు అడుగుపెట్టాలంటే భయపడుతున్నారు కొందరు.అయితే తాజాగా గుజరాత్ లోని ఐఐపీహెచ్ సంస్థ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

గుజరాత్ లోని ఐఐపీహెచ్ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సంస్థ) వైరస్ సోకిన వ్యక్తి నుంచి కొందరికి కచ్చితంగా వైరస్ వ్యాపిస్తుందని చెప్పలేమన్నారు.ఇప్పటివరకు కొన్ని కుటుంబాల్లో వైరస్ సోకినా వాళ్లలో కొందరికి వైరస్ సోకని లక్షణాలు కనిపిస్తున్నాయని అన్నారు.

ఐఐపీహెచ్ డైరెక్టర్ దిలీప్ మవలాంకర్ మాట్లాడుతూ.అంతర్జాతీయంగా ప్రచురితమైన 13 పరిశోధనల ఆధారంగా ఈ అధ్యాయనం చేశామన్నారు.

అహమ్మదాబాద్ లో కేసుల సంఖ్య బాగా తగ్గిపోయిందని, దానికి కారణం వారిలో ఉన్న హెల్త్ ఇమ్యూనిటీని పెంచుకోవడమేనని అన్నారు.ఇమ్యూనిటీ అధికంగా ఉన్న వారికి వైరస్ సోకినా తట్టుకునే శక్తి, నియంత్రించే శక్తి అధికంగా ఉంటుందన్నారు.

యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ న్యూరో సైంటిస్ట్ కార్ల్ ఫ్రిస్టస్ ప్రతిపాదించిన ‘ఇమ్యూనలాజికల్ బ్లాక్ హోల్’ సిద్ధాంతం ప్రకారం ప్రపంచ జనాబాలో 50 శాతం మందికి సోకదని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube