రంజాన్ పండుగను( Ramzan ) ముస్లిం సోదరులు ఎంతో భక్తి భావంతో జరుపుకుంటారు.చాలా నిష్టతో ఉపవాసం ఉండి.
దాన ధర్మ కార్యక్రమాలు చేసి అల్లా యొక్క కరుణాకటాక్షాలు పొందుకూని పరలోక సాఫల్యం పొందుకోవడానికి ఎంతగానో భక్తిశ్రద్ధలతో ఉంటారు.ప్రపంచవ్యాప్తంగా రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసం ఉంటారన్న సంగతి తెలిసిందే.
కనీసం ఉమ్ము కూడా మిగకుండా.చేసే ఈ కటిక ఉపవాసం ద్వారా వారు ఎంతగానో పుణ్యఫలాన్ని పొందుకుంటారు.
ఇదే సమయంలో పేదవాడి ఆకలి బాధ ఏంటో భగవంతుడి ఈ ఉపవాసంలో వారికి తెలిసేలా చేస్తారు.ఈ రంజాన్ మాసం లోనే ఖురాన్ అవతరించబడటంతో.మసీదులలో 30 రోజులలోనే మొత్తం ఖురాన్… పూర్తి చేయబడటం జరుగుద్ది.మనదేశంలో కూడా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు రంజాన్ పండుగను అధికారికంగా జరుపుతాయి.తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా రంజాన్ పండుగను జరిపింది.
దీనిలో భాగంగా ముస్లిం సోదరులకు ప్రభుత్వం తరఫున సీఎం జగన్ ఇఫ్తార్ విందు ఇచ్చారు.విజయవాడ విద్యాధరపురం మినీ స్టేడియంలో ఇఫ్తార్ విందు( Iftar ) కార్యక్రమంలో సీఎం జగన్( CM Jagan ) పాల్గొని ముస్లిం పెద్దలకు ఖర్జూరాలు తినిపించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ ప్రార్థించాలని సీఎం జగన్ కోరారు.ముందస్తుగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.