మీ ఇల్లు ఇలా ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే.. ఎలా అంటే?

సిరి సంపదలతో సుఖ సంతోషాలతో కుటుంబం హాయిగా జీవించాలని దేవుని ప్రార్థిస్తూ ఉంటాం.సిరి సంపదలు కలిగి లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవం చేయాలంటే ఇంట్లో కొన్ని ఆటంకాలు పరిచే వస్తువులను పద్ధతులను మార్చుకోవాలి.

 If Your House Is Like This Then Godess Lakshmi Devi Is There House Rules, Lakshmi Devi, Hindu Rituals, సిరి సంపదలు, సుఖ సంతోషాలు-TeluguStop.com

మనం నివాసముండే ఇంట్లో ప్రతి వస్తువును జాగ్రత్తగా పరిశీలించి పెట్టాలి.దాని వల్ల మనం జీవితంలో ఎంతో ఆనందంగా సిరిసంపదలు కలిగి జీవిస్తాము.

ఇక దీని ఫలితంగా లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మన ఇంట్లోనే ఉంటుంది.ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవం చేయాలంటే ఏం చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం.

 If Your House Is Like This Then Godess Lakshmi Devi Is There House Rules, Lakshmi Devi, Hindu Rituals, సిరి సంపదలు, సుఖ సంతోషాలు-మీ ఇల్లు ఇలా ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే.. ఎలా అంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మనం ప్రతిరోజు మన ఇష్టదైవాల్ని ప్రార్ధిస్తూ వుంటాం.కాబట్టి సకల దేవుళ్ళలో మనం ముందుగా పూజించాల్సిన దేవుడు వినాయకుడు.వినాయకుని పూజించడం ద్వారా మనం ఎటువంటి పనులు తలపెట్టిన ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా సాగుతాయి.కాబట్టి వినాయకుడిని ఎప్పుడూ మరువకూడదు.

కొంతమంది దేవునికి పూజ చేసిన పూలను కొద్ది రోజుల వరకు అలాగే ఉంచుతూ ఉంటారు.అలా చేయడం సరైన పద్ధతి కాదు.

వాడిన పువ్వులు ఇంట్లో ఉంటే, ఆ ఇంట్లో ధన నష్టం కలుగుతుందని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.

ఇంట్లో పావురాలు గూడుకట్టుకో కూడదు.అలాగే గబ్బిలాలు తిరగకూడదు.దీనివల్ల ఆ ఇంటి యజమాని ఆయుష్షు తగ్గుతుంది.మనం నివసించే ఇంటి సింహ ద్వారం మన పేరును బట్టి లేదా పుట్టిన తేదీని బట్టి అనుకూలంగా ఉండాలి.అలా ఉండటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది.

మనకు అనుకూలించని సింహద్వారం ఉన్న ఇళ్లలో ఉంటే, ఆర్థికంగా ఆరోగ్యంగా సమస్యలు తలెత్తుతాయి.

ఇంట్లో తలుపులు తెరిచేటప్పుడు లేదా మూసి వేసేటప్పుడు శబ్దం చేయకూడదు.

ఫలితంగా మీ ఇంట్లో వివాదాలు తలెత్తుతాయి.విరిగిపోయిన తలపు ఉంటే వీలైనంత త్వరగా మరమ్మతు చేయించాలి.

మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే ఇంటి ఆవరణలో తులసి మొక్కను పెంచాలి.అలాగే ఇంటి ఆవరణంలో ఎలాంటి పెద్ద పెద్ద వృక్షాలను పెంచకూడదు.

గాలి వెలుతురు ఇంటి లోపలికి వచ్చే విధంగా ఉండాలి.

ఇంటికి ఉత్తర దిశలో కుబేరుడు కొలువై ఉంటాడు.

కాబట్టి ఉత్తరం వైపు మురికిగా ఉంచకూడదు.ఉత్తర దిక్కున పూజలు చేయడం, ధూప దీప నైవేద్యాలతో పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఉత్తర దిశ నుంచి చెత్తను సేకరించ రాదు.

ఇవి పాటిస్తే ధనలక్ష్మి ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube