హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు మాసాలలో వచ్చే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.ఈ క్రమంలోనే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అని త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు.
పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు పరమశివుడు త్రిపుర అనే రాక్షసుడిని సంహరించడానికి వల్ల ఈ పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు.ఇకపోతే కార్తీక పౌర్ణమి అత్యంత పర్వదినమైన పండుగగా భావించి పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలను సందర్శించి కార్తీక దీపాలను వెలిగిస్తారు.
అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు సకల దేవతలు అందరూ నదిలో దిగి స్నానాలు ఆచరిస్తారని భావిస్తారు కనుక నదీస్నానాలు చేయడం వల్ల ఆ దేవ దేవుని ఆశీర్వాదం మనపై ఉంటుంది.
కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఎంతో పవిత్రంగా నియమనిష్టలతో పూజ చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
ముఖ్యంగా మీ రాశిలో సూర్యుడు బలపడాలంటే బిల్వ పత్రాలతో ఆ పరమేశ్వరుడిని పూజించాలి.అదేవిధంగా మహా విష్ణువుకి నెయ్యితో దీపారాధన చేసి పాయసం నైవేద్యంగా సమర్పించాలి.ఎంతో పవిత్రమైన ఈ పర్వదినాన పితృదేవతలకు తర్పణాలు పెట్టడం వల్ల వారి ఆత్మ శాంతిస్తుంది.
అలాగే తులసి చెట్టు కింద ఉసిరి దీపం వెలిగించడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మన పై ఉండి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు సమస్యలు లేకుండా కాపాడుతారు.ఎంతో పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు యజ్ఞయాగాదులలో పాల్గొన్న, దానధర్మాలు చేసిన 10 యజ్ఞ యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.ఇక ఈ పర్వదినాన వివాహం కాని అమ్మాయిలు త్రిజాత లక్ష్మి పూజ చేయటం వల్ల మంచి వరుడు లభిస్తాడు అలాగే బియ్యపు పిండితో చేసిన ప్రమిదలను11,21 లేదా108 దీపాలను నదిలో వదలటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL