బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ లిమిట్ దాటి విత్ డ్రా చేస్తే టాక్స్ కట్టాల్సిందే..!

ప్రస్తుతం భారతదేశంలో కోట్ల మంది బ్యాంక్ ఖాతాల( Bank accounts ) ద్వారానే చాలావరకు లావాదేవీలు జరుపుతున్నారని అందరికీ తెలిసిందే.

అయితే బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బును విత్ డ్రా చేసుకుంటే టాక్స్ కట్టాల్సి ఉంటుంది.

మరి టాక్స్ కట్టకుండా ఉండాలంటే ఎంత డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు.క్యాష్ విత్ డ్రాను జాగ్రత్తగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం.

బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులను విత్ డ్రా( With draw ) చేసుకోవడానికి ఒక లిమిట్ ఉంటుంది.ఆ లిమిట్ దాటి విత్ డ్రా చేసుకుంటే టాక్స్ కట్టాల్సి ఉంటుంది.

నిర్ణీత పరిమితికి మించి నగదు విత్ డ్రా చేస్తే కొంత ఛార్జ్ చెల్లించాలనే నిబంధన ఏటీఎం లావాదేవీలకే కాదు బ్యాంకుకు వెళ్లి డబ్బు తీసుకున్న కూడా వర్తిస్తుంది.

Advertisement

ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 194N ప్రకారం.ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల కంటే ఎక్కువ డబ్బు విత్ డ్రా చేసుకుంటే TDS చెల్లించాల్సి ఉంటుంది.ఈ TDS ఎవరు చెల్లించాల్సి ఉంటుందంటే.

వరుసగా మూడు సంవత్సరాల పాటు ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్( Income Tax Returns ) దాఖలు చేయని వారికి వర్తిస్తుంది.మూడు సంవత్సరాల పాటు ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చెయ్యని వారు కమర్షియల్ బ్యాంక్, కొ-ఆపరేటివ్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ నుంచి రూ ఇలవేల లక్షల కంటే ఎక్కువ డబ్బు విత్ డ్రా చేస్తే TDS చెల్లించాల్సి ఉంటుంది.

ఒకవేళ ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేసి ఉంటే, TDS చెల్లించకుండానే బ్యాంక్, సహకార బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ ఖాతా నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా కోటి రూపాయల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.

సాధారణంగా బ్యాంక్ ఖాతా నుంచి ఒక కోటి కంటే ఎక్కువ రూపాయలను విత్డ్రా చేసుకుంటే రెండు శాతం TDS చెల్లించాల్సి ఉంటుంది.అదే గత 3 సంవత్సరాల నుంచి ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ చెల్లించకుండా బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.20 లక్షలు విత్ డ్రా చేసుకుంటే 2 శాతం TDS చెల్లించాల్సి ఉంటుంది.కోటి రూపాయలకంటే ఎక్కువ విత్ డ్రా చేసుకుంటే 5శాతం TDS చెల్లించాల్సి ఉంటుంది.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
వీడియో: గుర్రాన్ని గెలికిన బుడ్డోడు.. లాస్ట్ ట్విస్ట్ చూస్తే గుండె బద్దలు..

ఇక ఏటీఎం కార్డు నుంచి డబ్బులు డ్రా చేసుకుంటే సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.చాలా బ్యాంకులు తమ ఏటీఎంలో నుంచి ప్రతినెల ఐదు ఉచిత లావాదేవీలు, ఇతర బ్యాంకుల ఏటీఎంలో నుంచి మూడు ఉచిత లావాదేవీలు అందిస్తున్నాయి.

Advertisement

మెట్రో నగరాల్లో అయితే సొంత బ్యాంక్ ఏటీఎంల నుంచి కేవలం మూడుసార్లు మాత్రమే ఉచితంగా డబ్బులు డ్రా చేసుకోవచ్చు.నిర్ణీత సంఖ్యకు మించిన లావాదేవీలకు రూ.21 చొప్పున బ్యాంకులు ఛార్జ్ వసూలు చేస్తాయి.

తాజా వార్తలు