ఫోన్‌లో పోర్న్ చూస్తే ఇక జైలుకేన‌ట‌..

ఈ మ‌ధ్య మ‌న భార‌త దేశంలో విప‌రీతంగా అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.మ‌రీ ముఖ్యంగా చిన్నారులపై విచ్చ‌ల‌విడిగా ఈ ఘ‌ట‌న‌లు పెరిగిపోవ‌డం చాలా బాధాక‌రంగా మారింది.

 If You Watch Porn On The Phone You Will Be In Jail-TeluguStop.com

అయితే ఇలాంటి దారుణాల‌కు అశ్లీల వెబ్ సైట్సే కారణమని, వాట‌ని చూసే ఇలా త‌యార‌వుతున్నార‌ని అందుకోస‌మే చైల్డ్ పోర్నోగ్రఫీపై ప్ర‌పంచ వ్యాప్తంగా నిషేధం విధించినా కూడా దాన్ని చూసే వారు మాత్రం త‌గ్గ‌ట్లేదు.అయితే ఇలా చూస్తే మాత్రం ఇక‌పై క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని తెలుస్తోంది.

చైల్డ్ పోర్న్ సైట్ ల‌ను సంప్ర‌దించినా లేదా ఆ వీడియోల‌ను చూసినా స‌రే జైలుకే అంటున్నారు సైబ‌ర్ క్రైమ్ పోలీసులు.

 If You Watch Porn On The Phone You Will Be In Jail-ఫోన్‌లో పోర్న్ చూస్తే ఇక జైలుకేన‌ట‌..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎవ‌రైనా ఇంట‌ర్ నెట్‌లో చైల్డ్‌ పోర్న్ సైట్ల కోసం వెతికితే వారిపై క‌ఠిన‌మైన చ‌ర్య‌లు ఉంటాయ‌ని చెబుతున్నారు.

ఇక ఇలాంటి వారిపై NCRB సంస్థ ఫోకస్‌ పెట్టి అలాంటి వారి వివ‌రాల‌ను సేక‌రించే ప‌నిలో ప‌డింది.ఇక ఇలాంటి వారి వివ‌రాలు సేక‌రించేందుకు ఢిల్లీలోని నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో రికార్డ్స్‌లో చైల్డ్‌ సెక్స్‌ అభ్యుజ్‌ మెటీరియల్‌ అనే టీమ్ ప్ర‌త్యేకంగా ఇలాంటి వాటి కోస‌మే వెతుకుతోంది.

ఎవ‌రైనా స‌రే చైల్డ్ పోర్న్ సైట్లు వెతికితే అలాంటి వారి నుంచి వెంటనే ఈ టీమ్‌కు స‌మాచారం వెళ్తుంది.ఇక వారు అలాంటి వారి వివ‌రాల‌ను సేక‌రిస్తారు.

Telugu Cyber Crime Police, Delhi, It Act 678, Jail, National Crime Control Beureau, Ncrb, Porn, Porn Illegal, Porn Websites, Rapes On Children, Watching Porn-Latest News - Telugu

రీసెంట్ గానే హైదరాబాద్ లో ఇలా చైల్డ్ పోర్న్ వీడియోలు చూసిన 16 మందిపై కేసులు కూడా పెట్టారంటే ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు.అయితే ఇలా చూసే ఐపీ చిరునామాలు ఎలాగూ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల చేతికి వెళ్తాయి కాబ‌ట్టి వారు ఈజీగానే అలాంటి వారి అడ్ర‌స్‌ల‌ను గుర్తిస్తారు.ఇక ఇలాంటి వారిపై ఐటి యాక్ట్ 67B సెక్ష‌న్ల కింద కేసులు రిజిస్ట‌ర్ చేస్తున్నామ‌ని పోలీసులు కూడా చెబుతున్నారు.కాబ‌ట్టి చేతిలో మొబైల్ ఉంది క‌దా ఏది ప‌డితే అది చూస్తే మాత్రం అలాంటి వారు ఇక జైలుకే వెళ్తార‌న్న మాట‌.

#Porn Websites #Ncrb #Porn #Porn #Jail

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు