ఇక పై ద్విచక్ర వాహనాల ప్రయాణం చేయాలంటే ఈ రూల్స్ పాటించాల్సిందే..!

తాజాగా కేంద్ర ప్రభుత్వం ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారికి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.ప్రతి ఒక్క ద్విచక్ర వాహనానికి వెనుక వైపు చక్రానికి సగం కవర్ అయ్యే విధంగా ‘సారి గార్డ్ , లతో పాటు చేతులు పట్టుకోడానికి వీలయ్యే విధంగా హోల్డర్స్ అలాగే కాళ్లు పెట్టుకోవడానికి ఫుట్ రెస్ట్ ల ను తప్పనిసరిగా ఉంచాలని అందులో తెలియజేసింది.2020 సంవత్సరం సంబంధించి తాజాగా కేంద్ర మోటారు వాహనాల నిబంధనలను రోడ్డు, రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలను విడుదల చేసింది.ఈ నిబంధనల ప్రకారం బైక్ వెనకాల కూర్చున్న వ్యక్తి విషయంలో భద్రత పరంగా అనేక కొత్త మార్గదర్శకాలను రూపొందించారు.

 Traffic Rules, Vehicles Users, New Rule's, Helmet, Back Side Person, Ministry Of-TeluguStop.com

తాజాగా ద్విచక్ర వాహనంలో వెనుక కూర్చున్న వ్యక్తి కి ఎలాంటి నియమాలు పాటించాలి వారు కేంద్రం తెలిపింది.

ఇందులో భాగంగానే.

మోటార్ సైకిల్ తయారు చేసే కంపెనీలకు బైకు వెనుక చక్రం వైపు హ్యాండ్ హోల్డర్స్, అలాగే ఫుట్ రెస్ట్ ఉండే విధంగా ఏర్పాటు చేయాలని తెలిపింది.వాహనాల తయారీ సంస్థలు బైక్ వెనుకల వైపు సారి గార్డ్ లను ఖచ్చితంగా అమర్చాలని తెలిపింది.

అయితే దీనికి కారణం లేకపోలేదు.దేశంలో చాలా బైకు ప్రమాదాలు వెనకవైపు చక్రం లో బట్టలు చింపుకొని సంభవిస్తున్నాయని నేపథ్యంలో ఇలాంటి జాగ్రత్తలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది.

వీటితో పాటు తేలికపాటి కంటైనర్లను ఉంచేందుకు మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.వీటితోపాటు కంపెనీలకు బైకుల టైర్ లకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.

Telugu Person, Helmet, Vehicles-Latest News - Telugu

బండి టైర్ల లో ఉండే గాలి యొక్క సాంద్రతను సెన్సార్ ద్వారా ఎంత ఉందో తెలుసుకునే విధంగా డిస్ప్లే ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది.వీటితో పాటు చివరగా టైర్ పంచర్ రిపేర్ కిట్లను కూడా మంత్రిత్వ శాఖ సిఫారసు కంపెనీలకు చేసింది.కాబట్టి కొత్త బైక్ కొనాలి అని అనుకున్న వారు ఇలాంటి జాగ్రత్తలు ఉండేలా కొత్త బండి ని ఎంచుకోవడం మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube