శరీరంలో వేడి తగ్గాలంటే ఇలా ఫాలో అయిపోండి..!

If You Want To Reduce Body Heat Follow This

వివిధ దేశాల్లోని మనుషులకు వివిధ రకాలుగా శరీరంలో ఉష్ణోగ్రత వేరుగా ఉంటుంది.దీనికి కారణం ఆయా దేశాలలో ఉన్న వాతావరణ పరిస్థితులు, అలాగే వారు నివసించే ప్రాంతానికి సంబంధించిన వాతావరణం వల్ల కొన్ని మార్పలు సంభవిస్తాయి.

 If You Want To Reduce Body Heat Follow This-TeluguStop.com

మనుషులకి అప్పుడప్పుడు జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి లాంటి సమస్యలు వస్తూనే ఉండటం గమనిస్తూనే ఉంటాం.ఇలాంటి సమయంలో అసలు కారణం శరీరంలోని ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు కావడమే.

అలాంటి సమయంలో మనం వెంటనే ఏదో ఒక మెడిసిన్ వైపు చూస్తాం.నిజానికి ఈ సమస్యకి మన శరీరంలోని ఉష్ణోగ్రతను సమతుల్యం చేసుకుంటే వాటి నుంచి ఇట్లే బయటపడవచ్చు.

 If You Want To Reduce Body Heat Follow This-శరీరంలో వేడి తగ్గాలంటే ఇలా ఫాలో అయిపోండి..-Telugu Health-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా శరీరంలో ఉన్న ఉష్ణోగ్రత ను కంట్రోల్ చేసుకోవచ్చు.

ముఖ్యంగా మన శరీరంలో వేడిని తగ్గించుకునేందుకు ఎక్కువగా నీరును తీసుకోవాలి.

అయితే ఇందుకు వీలైనంతవరకు చల్లని నీటిని తీసుకోకూడదు.రూమ్ టెంపరేచర్ వద్ద ఉన్న నీటిని మాత్రమే ఎక్కువ మొత్తంలో తీసుకుంటే శరీరంలో వేడిని చాలావరకు తగ్గించవచ్చు.

ఎన్నో రకాల టాబ్లెట్స్ వేసుకోవడం కంటే.నీటిని తాగడం కంటే మరో గొప్ప నివారణ లేదని నిపుణులు తెలుపుతున్నారు.

అయితే కేవలం నీటిని మాత్రమే కాకుండా పెరుగు ను మజ్జిగలా చేసుకుని అలాగే కొబ్బరి బొండాల ను ఎక్కువగా తీసుకోవడం ద్వారా శరీరంలో ఉష్ణోగ్రతను బాగా తగ్గించుకోవచ్చు.

వీటితో పాటు ఓ గ్లాసు గోరువెచ్చని పాలలో కాస్త పచ్చ కర్పూరం తోపాటు యాలకుల పొడి, గసగసాల పొడి కలుపుకుని తాగితే శరీరంలో ఉన్న వేడి మొత్తం మాయమవుతుంది.

అలాగే కడుపులో ఎలాంటి అల్సర్ లాంటి సమస్యలు ఉన్నా కూడా వీటివలన సులువుగా బయటపడవచ్చు.వీలైనంతవరకు గసగసాల పొడిని తగ్గిస్తే మేలు.కడుపులో ఏదైనా నొప్పి లేకపోతే మంట అలా అనిపించినప్పుడు మాత్రమే కాస్త గసగసాల పొడిని వాడితే మేలని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.కాబట్టి శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించుకోవాలంటే వీలైనంత నీరును తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.

#Ayurvedic #Temperature #Water #Human #Stomach

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube