మీ పేరుతో మార్కెట్లో ఎన్ని ఫోన్ నెంబర్లు చలామణిలో ఉన్నాయి తెలుసుకోవాలంటే ఇలా చేయండి..!

సాధారణంగా మనం ఏదైనా కొత్త ఫోన్ నెంబర్ కావాలి అనుకుంటే దగ్గర్లో ఉండే మొబైల్ కంపెనీ దగ్గరికి వెళ్లి తీసుకుంటాము.కొత్త ఫోన్ నెంబర్ కోసం మనం కొన్ని ఆధారాలను సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

 If You Want To Know How Many Phone Numbers Are In Circulation In The Market With-TeluguStop.com

ప్రస్తుత రోజులలో సైబర్ క్రైమ్ బాగా పెరిగిపోయింది.మనకు తెలియకుండానే మన పేరు మీద  సిమ్ కార్డులు తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

మనం ఇచ్చిన ఆధారాలను దుర్వినియోగం చేసి మన పేరుతో మరో సిమ్ కార్డులు తీసుకుంటున్నారు కొందరు.అయితే అలాంటి సిమ్స్ ఉపయోగించి ఏదైనా చట్టవ్యతిరేకమైన పని చేస్తే ఆ సమయంలో మనం ఇరకాటంలోకి  పడాల్సిందే.

తాజాగా ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు మన పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకునే  సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది టెలికాం సంస్థ.మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డు ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక ప్రత్యేకమైన వెబ్ సైట్లు రూపుదిద్దు కోవడంతో ప్రజలందరికి  శుభవార్త తెలియచేసింది.

ఇందుకు ముందుగా మనం https://tafcop.dgtelecom.go.in వెబ్ సైట్ ఓపెన్ చేసాక మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే దానికి వచ్చే ఓటిపి నమోదు చేయగా మన పేరు మీద ఉన్న సిమ్ కార్డు వివరాలు అన్నీ కూడా ఇట్టే తెలుసుకోవచ్చు.ఇక ఈ వివరాలన్నీ పరిశీలించుకుని వాటిలో మనకు అవసరం లేనివి, మనకు తెలియకుండా మన పేరు మీద ఉన్న సిమ్ కార్డులను సులువుగా తొలగించుకోవచ్చు.అందులో ఏదైనా తెలియని నెంబర్స్ ఉంటే మనం టెలికం శాఖ వారికి సబ్మిట్ చేసే వారు తగిన చర్యలు చేపడతారు.సాధారణంగా ఒకరి పేరు మీద అత్యధికంగా 9 నెంబర్లు ఉండే అవకాశలు ఉన్నాయి.

ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడం కోసమే ఈ ప్రత్యేక వెబ్ సైట్ ను  ప్రారంభించినట్లు విజయవాడ టెలికామ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాబర్ట్ రవి పేర్కొంటున్నారు.ఇక ఈ వెబ్సైట్ ఆధారంగా సైబర్ నేరాలకు చెక్ పెట్టవచ్చని, అనధికారికంగా వినియోగిస్తున్న ఫోన్ నెంబర్లు అన్ని కూడా చెక్ పెట్టవచ్చు.

ఈ సౌకర్యాన్ని ముందుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిధిలో ప్రవేశపెట్టి, ఈ ప్రాంతాలలో వచ్చిన ఫలితాలను చూసి అనంతరం దేశవ్యాప్తంగా ఈ వెబ్సైట్ అందుబాటులోకి తీసుకొని రాబోతున్నట్లు విజయవాడ టెలికాం శాఖ వారు తెలుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube