మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఇలా ఫాలో అవ్వండి..!

స్మార్ట్ ఫోన్ లో ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నా వాటికి కావలసింది మాత్రం బ్యాటరీ బ్యాకప్.ఫోన్ లో వాడే యాప్ లను బట్టి ఫోన్ బ్యాటరీ ఖాళీ అయి పోవడం మనం తరచూ చూస్తూనే ఉంటాం.

 If You Want To Increase The Battery Life Of Your Smartphone, Follow This   Smart-TeluguStop.com

కొత్త ఫోన్ కొన్నప్పుడు అందులో ఛార్జింగ్ బాగానే ఉన్నట్లు కనబడుతుంది.ఫోన్ కొన్న మూడు నుంచి నాలుగు నెలల తర్వాత అసలైన పరిస్థితి మొదలవుతుంది.

బ్యాటరీ యొక్క హెల్త్ రోజురోజుకూ క్షీణిస్తూ రావడంతో మనం గమనిస్తూనే ఉంటాం.అయితే చార్జింగ్ ఇలా తగ్గిపోవడానికి గల కారణాలను ఓ సారి చూద్దాం.

Telugu Apps, Battery Backup, Batterylife, Bluetooth, Smart, Wifi-Technology Telu

ఇందులో మొదటగా చెప్పుకోవాల్సింది ఫోన్ బ్యాటరీ శాతం పూర్తిగా క్షీణించే వరకు ఉంచవద్దు.ఎప్పుడైతే బ్యాటరీ శాతం 20 శాతానికి తక్కువ లేకుండా ఉండేలా చూసుకుంటే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రోజులు వచ్చే అవకాశం ఉంటుంది.అలాగే మరొక విషయం కొందరు రాత్రిపూట పడుకునే ముందు మొబైల్ ఫోన్ చార్జింగ్ పెట్టి వదిలేస్తారు.ఇలా చేయడం వల్ల బ్యాటరీ ఓవర్ చార్జింగ్ తో పూర్తిగా దెబ్బతినే అవకాశం ఎక్కువ.

వీటితో పాటు ప్రతి సారి 100% చార్జింగ్ చేయడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు.కేవలం 90 శాతం దాటి చార్జింగ్ చేసుకుంటే సరిపోతుంది.ఇలా చేయడం వల్ల ఓవర్ ఛార్జింగ్ ను అదుపు చేయడం, అలాగే బ్యాటరీ కండిషన్ ను కాపాడుకునే వాళ్ళం అవుతాం.

Telugu Apps, Battery Backup, Batterylife, Bluetooth, Smart, Wifi-Technology Telu

వీటితోపాటు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా రావాలంటే పవర్ సేవింగ్ మోడ్ ను మీ మొబైల్స్ లో ఆన్ చేసుకొని ఉండడం మంచిది.దీనికి కారణం మొబైల్ ఫోన్ లో మల్టీటాస్కింగ్ విధానం వల్ల బ్యాక్ గ్రౌండ్ లో అనేక రకాల యాప్స్ రన్నింగ్ లో ఉండడంవల్ల పవర్ ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది.వీటితో పాటు బ్లూటూత్, వైఫై లాంటివి అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించి వివిధ సమయాల్లో వాటిని ఆఫ్ చేసి ఉంటే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ సేపు ఉంటుంది.

ఇంకా సరైన విధంగా లేని కెబుల్స్ తో ఫోన్లను ఛార్జింగ్ చేసుకోకూడదు.దీనికి కారణం అవి బ్యాటరీ ని బాగా వేడి పొందేలా చేస్తాయి.దీనివల్ల బ్యాటరీ తో పాటు మొబైల్ కు కూడా హాని కలిగే అవకాశం ఉంది.ముఖ్యంగా మీ స్మార్ట్ ఫోన్ లో ఉపయోగించే యాప్స్ ఉంటే వాటిని ఎంత తొలగిస్తే మీ మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ లైఫ్ ఎక్కువ రోజులు వస్తుంది.

ఒకవేళ వాటిని ఉపయోగించకపోతే టర్న్ ఆఫ్ చేసే విధంగా ప్రయత్నాలు చేయండి.ఇలా కొన్ని విధానాలను పాటిస్తే మీ మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రోజులు కొనసాగించవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube