అవివాహితులు తమకు ఇష్టమైన వ్యక్తి లేదా వారు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని చాలా మంది భావిస్తుంటారు.ఆ విధంగా కోరుకునేవారు కచ్చితంగా ఈ మంత్రాన్ని 108 సార్లు 27 రోజుల పాటు పఠించడం వల్ల తప్పకుండా కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
ఆది దంపతులుగా పార్వతీపరమేశ్వరులను భావిస్తారు.అయితే ఈ మంత్రం సాక్షాత్తు ఆ పార్వతీ దేవికి సంబంధించినది.
మన స్పూర్తితో, భక్తిభావంతో పార్వతీ దేవిని పూజించి ఈ మంత్రం చదవటం వల్ల తప్పకుండా కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని పండితులు చెబుతున్నారు.
ప్రతి రోజూ 108 సార్లు ఏకాగ్రతతో ఈ మంత్రం చదవడం వల్ల ఆ పార్వతి, పరమేశ్వరుల అనుగ్రహం కూడా కలుగుతుంది.కోరిన కోరికలు నెరవేరడమేకాకుండా, వారి వివాహంలో ఏర్పడిన అడ్డంకులు, దోషాలు కూడా తొలగిపోయి సవ్యంగా వివాహం జరుగుతుంది.“హే గౌరీ శంకరార్ధాంగి, యధాత్వం శంకరప్రియాతథామాం, కురు కళ్యాణి, కాంత కాంతం సుదుర్లభమ్” అనే ఈ మంత్రాన్ని 108 సార్లు, 27 రోజుల పాటు తప్పకుండా చదవటం వల్ల అనుకున్న కోరికలు నెరవేరి వివాహం జరుగుతుంది.
పార్వతి మంత్రాన్ని చదవటానికి ఏదైనా మంచి రోజు లేదా మంగళవారం ప్రారంభించాలి.ఉదయం స్నానం చేసి ఎరుపు రంగు దుస్తులను ధరించి, ఎరుపు రంగు పుష్పాలతో పార్వతి దేవిని పూజ చేసి ధూప దీపాలను వెలిగించి అమ్మవారి మంత్రం చదవడం ప్రారంభించాలి.27 రోజుల పాటు ఇదే విధంగా గౌరీ మాతకు పూజ చేసి చివరి రోజు వివాహం కాని ఏడుగురు పిల్లలను ఇంటికి పిలిచి వారికి అన్నదానం చేయాలి.అదేవిధంగా ఆ ఏడుగురికి తాంబూలంతో పాటు బహుమతులను ఇచ్చి పంపాలి.
ఈ విధంగా నియమనిష్టలతో 27 రోజుల పాటు క్రమం తప్పకుండా గౌరీదేవికి పూజ చేయటం వల్ల తప్పకుండా కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని, వివాహంలో ఆటంకాలు ఉన్న తొలగిపోయి వివాహం సవ్యంగా జరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL