ఎల్పీజీ ఏజెన్సీ పొందాలంటే ఇలా చేస్తే సరి...!

మన దేశం ఎంత అభివృద్ధి చెందుతున్నాగాని చాలామంది ప్రజలు ఇంకా కట్టెల పొయ్యి మీదనే వంటలు చేస్తున్నారు.మన దేశంలో ఇంకా చాలామందికి గ్యాస్ కనెక్షన్ లేదు.

 If You Want To Get An Lpg Agency, It Is Ok To Do This ...!  Lpg Cylinders,lpg Ag-TeluguStop.com

ఈ క్రమంలోనే మన ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ ను ప్రవేశ పెట్టారు.ఈ స్కీమ్ ప్రకారం గ్యాస్ సిలిండర్ లేని పేదలకు కేంద్రమే గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ను అందిస్తోంది.

అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా కోటి మందికి కొత్తగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేస్తుంది.కానీ ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది.

గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు అవసరం అవుతున్నాయి కాబట్టి గ్యాస్ ఏజెన్సీలపై అధిక ఒత్తిడి పడుతుంది.ఈ క్రమంలోనే ఇప్పుడు కేంద్రం కొత్త గ్యాస్ ఏజెన్సీలను నియమించాలని ఆలోచన చేస్తుంది.

ప్రస్తుతం మన దేశంలో ఇప్పటిదాకా మూడు ప్రభుత్వ ఎల్‌పీజీ కంపెనీలు మాత్రమే ఉన్నాయి.అందుకే కొత్త గ్యాస్ ఏజెన్సీలు అవసరం అని కేంద్రం భావిస్తుంది.అయితే మీరు కొత్తగా గ్యాస్ ఏజెన్సీ లేదా డిస్ట్రిబ్యూటర్‌షిప్‌ తీసుకోవాలంటే కొన్ని నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి.అవి ఏంటంటే.మీరు కచ్చితంగా భారత దేశ పౌరుడై ఉండాలి.కనీసం10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి.

Telugu Agency Benifits, Dealer Ship, Latest, Lpg Agency, Lpg Cylinders-Latest Ne

ఇకపోతే వయసు విషయానికి వస్తే.21 నుంచి 60 సంవత్సరాల వయస్సు ఉండాలి.దరఖాస్తు చేసే అభ్యర్థుల కుటుంబంలో ఎవరు కూడా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలో పని చేయకూడదు.గ్యాస్‌ సిలిండర్‌ లను నిల్వ ఉంచుకోవడానికి పెద్ద గోడౌన్ తప్పనిసరిగా ఉండాలి.

పైన నిబంధనలకు అనుకూలంగా ఉన్నవాళ్లు మాత్రమే గ్యాస్ ఏజెన్సీ కోసం దరఖాస్తు చేసుకోవాలి.ఆన్లైన్‌ లేదా ఆఫ్‌ లైన్‌ లో దరఖాస్తు చేసుకున్న తరువాత ఇంటర్వ్యూకు వెళ్లవలిసి ఉంటుంది.

అలాగే పూర్తి వివరాలు తెలుసుకోవడానికి కింద ఇచ్చిన లింక్ లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.https://www.lpgvitarakchayan.in/index.php.అలాగే కంపనీ రూల్స్ ప్రకారం డిపాజిట్ మొత్తం, బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని కరెక్ట్ గా ఉండాలి.అంతేకాకుండా జనరల్‌ కేటగిరి అభ్యర్థులకు 50% శాతం రిజర్వేషన్‌ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది.మరి మీలో ఎవరికన్నా గ్యాస్ ఏజెన్సీ పెట్టాలని ఆసక్తి ఉన్నట్లయితే త్వరపడండి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube