ఇకపై అక్కడ ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే పొగతాగడం మానేయాల్సిందే..!

మనిషి చెడిపోవడంలో కీలక పాత్ర వహించేది పొగ త్రాగడం.కొందరు సమాజం కోసం తాగుతున్నారని పొంతన లేని కబుర్లు చెబుతున్న వారు ఎందరో.

 Smokeing, Stoping, Government Job, Jobs, Jarkand, State Of Jharkhand, Bokaro Ran-TeluguStop.com

అయితే ఇది వరకు ప్రముఖ కవి పొగ తాగని వాడు దున్నపోతై పుట్టును అన్నట్లుగా రాశారు.అయితే పొగతాగడం హానికరం అని సిగరెట్ పెట్ట పైన రాసి అమ్మే రోజులు ఇవి.సిగరెట్ పెట్టె పై ఆరోగ్యానికి హానికరం అని రాసి ఉన్న దాని ప్యాకెట్లు ప్యాకెట్లు కొని అలా ఊదేస్తుంటారు ఎందరో పొగరాయుళ్లు.దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలను అతి తక్కువ వయస్సులోనే తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ముఖ్యంగా క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన జబ్బులకు అతిత్వరగా వాటి బారిన పడాల్సి వస్తుంది.

ఇకపోతే సిగరెట్ రేట్లు ప్రతి సంవత్సరం పెరుగుతున్న కొద్దీ.

ప్రజలు మానడం లేదు సరికదా.మరింతగా తాగే వారు ఎక్కువ అయిపోయారు.

పరిస్థితి ఇలా ఉండగా తాజాగా జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం సిగరెట్టుతో ఆ రాష్ట్ర ఉద్యోగానికి ముడి పెట్టింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

తాజాగా జార్ఖండ్ ప్రభుత్వం యువతలో మార్పు తీసుకురావడానికి, పొగతాగే వారి సంఖ్య తగ్గించడానికి ఉద్దేశంతో సిగరెట్ కు ఆ రాష్ట్ర ఉద్యోగానికి ముడి పెట్టింది.దీంతో 2021 ఏప్రిల్ ఒకటో తారీకు నుండి కొత్త నిబంధనలను ఆ రాష్ట్రంలో అమల్లోకి రాబోతున్నాయి.

జార్ఖండ్ రాష్ట్రంలో ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ధూమపానానికి దూరంగా ఉండాలని కొత్త నిబంధన తీసుకొని వచ్చింది.అయితే దీనిని నిర్ధారించేందుకు పొగతాగటం లేదని.

అఫిడవిట్ కూడా ఉద్యోగంలో చేరాలంటే సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసింది.

Telugu Job, Jarkand, Jobs-Latest News - Telugu

అయితే జార్ఖండ్ రాష్ట్రంలో కేవలం 150 మంది ట్రేడర్స్ మాత్రమే పొగాకు ఉత్పత్తులు విక్రయించేందుకు అధికారికంగా లైసెన్స్ కలిగి ఉన్నారని, మిగతా వారందరూ ఎటువంటి లైసెన్సులు కలగలేదని ప్రభుత్వం తెలియజేసింది.అంతేకాదు సిగరెట్లు అమ్మే దుకాణాలలో టీ, బిస్కెట్లు కూడా అమ్ముతున్నారని అలా చేయకూడదని అలాగే ఒకవేళ చేస్తే అది నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వ అధికారులు తెలుపుతున్నారు.అయితే అతి త్వరలోనే జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో రాంచి, ధన్ బాద్, కుంతి, హజీరా బాగ్, సరైకేల జిల్లాలలో పొగాకు రహిత జిల్లాలుగా మార్చి కొత్త చరిత్ర తిరగరాయబోతున్నాం అని ప్రభుత్వం తెలిపింది.

ఇకపోతే ఏప్రిల్ నుండి ఉద్యోగం పొందాలనుకుంటే మాత్రం కచ్చితంగా తాము పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటామని చెబుతూ అఫిడవిట్ సమర్పిస్తేనే ఉద్యోగం వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube