వినడానికి ఆశ్చర్యకరంగా వున్నా, మీరు విన్నది నిజమే.మనలో చాలామంది సరదాగా అప్పుడప్పుడూ భోజనం చేసేందుకని రెస్టారెంట్‌కు వెళుతూ వుంటారు.
కొన్ని రెస్టారెంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర్చేనేందుకు చోటు దొరుకుంతుంది.మరికొన్ని మంచి రెస్టారెంట్స్ లో అయితే అలా కుదరదు.
కొన్ని గంటలు వైట్ చేసాక గానీ, ఆర్డర్ చేసి ఫుడ్ మనముందుకు రాదు.అయితే కొన్ని ఉంటాయి, అక్కడ తినాలంటే ఒకటి లేదా రెండు రోజుల ముందుగానే టేబుల్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది.
ఇదంతా ఒకెత్తయితే ఇపుడు చెప్పబోయే విషయం తెలిస్తే అంతకుమించి అని అంటారు.
అవును, యూకేలోని ఓ చిన్న పబ్ గురించి తెలిస్తే మీరు అవాక్కవుతారు.అక్కడ ఆదివారం టేబుల్ బుక్ చేసుకోవడం అంత సులువు కాదు.యూకేలోని బ్రిస్టల్( Bristol )లో ఉన్న ‘ది బ్యాంక్ టావెర్న్( The Bank Tavern )’ అనే చిన్న పబ్ ఉంది.
ఇక్కడ ఆదివారం రోజున భోజనాన్ని బుక్ చేసుకొని ఆస్వాదించడమంటే బ్రహ్మాండం అన్నంత పని.అవును, ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా సిద్ధం చేసే సండే రోస్ట్‌ల కోసం ఏకంగా 4 సంవత్సరాల పాటు వేచి చూడాలి మరి.అక్కడి రెస్టారెంట్ బుకింగ్ నిపుణులు యూకేలోనే సుధీర్ఘ వెయిటింగ్ లిస్టు ఉన్న పబ్‌గా దీన్ని గుర్తించారు.అయితే కరోనా సమయంలో దేశవ్యాప్తంగా చాలా వరకు పబ్‌లు, రెస్టారెంట్‌లు మూసివేయాల్సి వచ్చింది.
దీంతో ఈ పబ్‌లో సండే రోస్ట్‌ల కోసం జరిగినటువంటి ముందస్తు బుకింగ్స్ వెయిటింగ్ లిస్ట్ అమాంతం పెరిగిపోయింది.
ఇప్పుడు అక్కడ బుక్ చేసుకునేవాళ్లు సండే రోస్టులు ఆస్వాదించాలంటే మాత్రం నాలుగేళ్ల వరకు ఆగాల్సిందేనట.ఇక్కడ రోస్టులు చాలా ప్రత్యేకం అంటున్నారు జనం.అందులో ప్రత్యేకమైన వంటకాలు వడ్డిస్తారట. 2018లోనే బ్రిస్టల్ గుడ్‌ఫుడ్ అవార్డ్స్( Bristol Good food Awards )తో ఉత్తమ సండే లంచ్‌గా ఇది ఎంపికైంది.2019లో ఈ చిన్న పబ్ అబ్జర్వర్ ఫుడ్ మంత్లీ అనే అవార్డుతో పాటు అనేక అవార్డులను సొంతం చేసుకుందంటే దాని ఇమేజ్ మనం అర్ధం చేసుకోవచ్చు.ఇలాంటి విచిత్రమైన హోటల్స్ గురించి మీకు తెలిస్తే కింద కామెంట్స్ చేయండిక.