మీరు గిన్నీస్ వరల్డ్ సృష్టించాలంటే..ఆ పని చేయాల్సిందే..

మీకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాలని ఉందా? అయితే బ్రెయిన్ చాలా కష్టపడాల్సి వస్తుంది.ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా… చాలా టైమ్ వేస్ట్ అవుతుంది.

 If You Want To Create A Guinness World Record, You Have To Do It , Lego Bricks,-TeluguStop.com

అందుకు తగినట్లుగా బ్రిక్స్ సెట్ చేసుకుంటూ వెళ్లాలి.మీరు కూడా లెగో బ్రిక్స్‌తో ఇతరులు చేయలేనంత వేగంగా ఏదైనా వస్తువును తయారుచెయ్యండి.

తద్వారా మీ పేరున రికార్డును నమోదు చేయించుకోండి.

ఐతే.

లెగో బ్రిక్స్ ని అసెంబ్లింగ్ చెయ్యడం అనేది అంత తేలికైన విషయం కాదు.బ్రెయిన్ చాలా కష్టపడాల్సి వస్తుంది.

చేయాలనుకున్న బొమ్మ ముందుగానే బ్రెయిన్‌లో ఫిక్స్ అవ్వాలి.అందుకు తగినట్లుగా బ్రిక్స్ సెట్ చేసుకుంటూ వెళ్లాలి.

ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా… చాలా టైమ్ వేస్ట్ అవుతుంది.మరి అతను టైటానిక్ షిప్‌ని లెగో బ్రిక్స్‌తో ఎలా చేశాడో తెలుసుకుందాం.

అతని పేరు పాల్ ఉఫేమా.అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందినవాడు.అతనికి యూట్యూబ్‌ ఛానెల్ ఉంది.తను సొంతంగా లెగో బ్రిక్స్‌తో రకరకాల బొమ్మలు తయారుచేస్తుంటాడు.

తాజాగా 9,090 లెగో బ్రిక్స్ వాడి… టైటానికి షిప్‌ను తయారుచేసి… గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.పాల్ ఉఫేమాకి 15 లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

వాళ్లందరికీ లెగో బ్రిక్స్ అంటే ఇష్టమే.వాళ్లలో చాలా మంది తాము సంపాదించే డబ్బులో ఎక్కువ మొత్తాన్ని రకరకాల లెగోబ్రిక్స్ కొనేందుకు ఖర్చు చేస్తున్నారు.

పాల్ కూడా అదే టైపు.ఉఫేమా ఇప్పటివరకు లెగో జురాసిక్ పార్క్ డైనోసార్లు, లెగో స్టార్ వార్స్ లొకేషన్స్, కెప్టెన్ అమెరికా షీల్డ్ ఇలా చాలా వాటిని తయారుచేశాడు.

తాజాగా టైటానిక్‌ లెగో బ్రిక్స్ సెట్ కొనుక్కొని… దానికి సంబంధించిన బుక్‌లో చెప్పిన విధంగా బ్రిక్స్ సెట్ చేశాడు.

Telugu America Shield, Lego, Legojurassic, Lego Wars, Paul Ufema-Latest News - T

ఇందుకు 10 గంటల 46 నిమిషాల 31 సెకండ్లు పట్టింది.ఇప్పటివరకు అంత వేగంగా ఎవరూ టైటానిక్‌ని లెగో బ్రిక్స్‌తో తయారుచెయ్యలేదు.అందువల్ల గిన్నీస్ రికార్డు అతని వశమైంది.గిన్నీస్ బుక్ సంస్థ యూట్యూబ్‌లోని ఛానెల్‌లో ఈ వీడియోని ఏప్రిల్ 8న అప్‌లోడ్ చెయ్యగా ఇప్పటివరకు లక్ష మందికి పైగా చూశారు.3వేల మందికి పైగా లైక్ చేశారు.ఇదివరకు ఉఫేమా… ఎగో మిల్లేనియం ఫాల్కన్‌ని ఇలాగే తయారుచెయ్యాలని ప్రయత్నించాడు.ఐతే ఒక్క బ్రిక్ విషయంలో మిస్ అవ్వడంతో ఆ రికార్డు సాధించలేకపోయాడు.వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఈ సెట్‌ని లెగో కంపెనీ బాగా తయారుచేసింది.ఏ తేడాలూ లేకపోవడం అద్భుతని ఓ యూజర్ కామెంట్ ఇచ్చారు.నిజమేమరి… ఏదైనా తేడా ఉంటే… రికార్డు సాధించడం వీలు కాదు కదా.ఇది నాకు 24 గంటలు పట్టింది.అతను అంత వేగంగా చెయ్యడం అద్భుతం.

నేను దాన్ని నిర్మించేందుకు చాలా టైటానికి సినిమాలు చూశాను.అవి నాకు హెల్ప్ చేశాయి” అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.

టైటానికి మునిగిన దాని కంటే వేగంగా అతను దాన్ని నిర్మించాడని మరో యూజర్ జోక్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube