పావు గంట‌లో ఫేస్ గ్లోగా మారాలంటే ఈ సింపుల్ చిట్కాను మీరు ట్రై చేయాల్సిందే!

If You Want To Become A Face Glow You Have To Try This Simple Tip! Face Glow, Simple Tip, Latest News, Skin Care, Skin Care Tips, Beauty, Beauty Tips, Glowing Skin,

ఏదైనా పార్టీకో, ఫంక్ష‌న్‌కో స‌డెన్‌గా వెళ్లాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఇన్‌స్టంట్‌ ఫేస్ గ్లో కోసం ఏవేవో ప్ర‌యోగాలు చేస్తుంటారు.మార్కెట్‌లో దొరికే ర‌క‌ర‌కాల ఫేస్ మాస్క్‌ల‌ను కొనుగోలు చేసి యూజ్ చేస్తుంటారు.

 If You Want To Become A Face Glow You Have To Try This Simple Tip! Face Glow, Si-TeluguStop.com

అయితే ఒక్కో సారి వాటి వ‌ల్ల పెద్ద‌గా ఫ‌లితం ఉండ‌క పోవ‌చ్చు.కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ చిట్కాను ట్రై చేశారంటే కేవ‌లం పావు గంట‌లోనే ముఖం కాంతి వంతంగా మెరిసి పోతుంది.

మ‌రి ఆల‌స్యం చేయ‌డ‌మెందుకు ఆ చిట్కా ఏంటో ఓ లుక్కేసేయండి.

ముందుగా ఒక క్యారెట్ తీసుకుని పీల్‌ను తొల‌గించి నీటిలో శుభ్రంగా క‌డగాలి.

ఆ త‌ర్వాత క్యారెట్‌ను చిన్న చిన్న‌ ముక్క‌లుగా క‌ట్ చేసుకుని.ఆవిరిపై ప‌ది నిమిషాల పాటు బాగా ఉడికించాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ఉడికించి పెట్టుకున్న‌ క్యారెట్ ముక్క‌లు వేసి వాట‌ర్ సాయంతో మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

ఈ పేస్ట్‌లో ఐదు స్పూన్ల కొబ్బ‌రి పాలు, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్‌, ఒక స్పూన్ రోజ్ వాట‌ర్, చిటికెడు క‌స్తూరి ప‌సుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆపై ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, కావాలీ అనుకుంటే మెడ‌కు ప‌ట్టించి పావు గంట పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.అనంత‌రం స్మూత్‌గా వేళ్ల‌తో ర‌బ్ చేసుకుంటూ గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

అంతే ఈ సింపుల్ చిట్కాను ట్రై చేస్తే గ‌నుక పావు గంట‌లోనే మీ ముఖం గ్లోగా, షైనీగా మెరిసి పోతుంది.అంతే కాదు, చ‌ర్మంపై ఏమైనా మ‌లినాలు, మృత క‌ణాలు ఉన్నా తొల‌గి పోయి చ‌ర్మం స్మూత్ అండ్ సాఫ్ట్‌గా త‌యారు అవుతుంది.కాబ‌ట్టి, ఇకపై ఎప్పుడైనా ఇన్‌స్టంట్‌ గా ఫేస్‌ను గ్లో గా మార్చుకోవాలని అనుకుంటే ఖ‌చ్చితంగా పైన చెప్పిన చిట్కాను ప్ర‌య‌త్నించండి.

If You Want To Become A Face Glow You Have To Try This Simple Tip! Face Glow, Simple Tip, Latest News, Skin Care, Skin Care Tips, Beauty, Beauty Tips, Glowing Skin, - Telugu Tips, Face Glow, Skin, Latest, Simple Tip, Skin Care, Skin Care Tips

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube